ఇంట్రెస్టింగ్ పోస్టర్స్ తో “గుంటూరు కారం”..!

ఇంట్రెస్టింగ్ పోస్టర్స్ తో “గుంటూరు కారం”..!
Cinema News

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ గుంటూరు కారం. ఈ మూవీ సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన ప్రచార సినిమా ల కి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా నుండి మేకర్స్ రిలీజ్ చేస్తున్న సరికొత్త పోస్టర్లు సినిమా పై మరింత అంచనాలను పెంచేస్తున్నాయి.

ఇంట్రెస్టింగ్ పోస్టర్స్ తో “గుంటూరు కారం”..!
Guntur Karam

సూపర్ స్టార్ మహేష్ లుంగీ కట్టుకొని అలా స్టైలిష్ గా నడుస్తున్న పోస్టర్ విపరీతం గా వైరల్ అవుతుంది . ఈ మూవీ లో శ్రీ లీల, మీనాక్షి చౌదరి లు లేడీ లీడ్ రోల్స్ లో నటిస్తుండగా, మ్యూజికల్ సెన్సేషన్ థమన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు సూపర్ స్టార్ మహేష్ కాంబినేషన్ లో వస్తున్న ఈ గుంటూరు కారం కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.