AP Politics: రాజకీయ పార్టీ అధినేతలపైన విరుచుకుపడ్డ వైయస్ షర్మిల

Election Updates: These are the Congress Lok Sabha and Assembly candidates in AP..!
AP Politics: Sharmila will be initiated in Delhi tomorrow for a special 'hoda'

ఏపీలోని రాజకీయ పార్టీ అధినేతలపైన వైయస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని కీలక పార్టీలైన వైఎస్ఆర్సిపి, తెలుగుదేశం, జనసేన పార్టీలు బిజెపికి బానిసలుగా మారాయని వైయస్ షర్మిల ఆరోపించారు.శుక్రవారం నాడు షర్మిల గుంటూరులో పర్యటించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. ‘B అంటే బాబు, J అంటే జగన్, P అంటే పవన్. రాష్ట్రంలో YSR పాలన ఎక్కడా లేదు. హామీలు ఇచ్చి మోసం చేయడం YSR పాలన కాదు. ఇది గుంటూరు, కానీ గుంటలూరుగా మార్చారు. గుంటలూరు మళ్లీ గుంటూరు కావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి. కాంగ్రెస్ కి ఓటేస్తే ప్రత్యేక హోదా వస్తుంది’ అని షర్మిల హామీ ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్ లో ప్రతి గడప తొక్కుతా, వీలైనంత ఎక్కువ మందిని కలుస్తానని తెలిపారు. కాంగ్రెస్ మాత్రమే ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురాగలదని అన్నారు. ఏపీలో వైసీపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన ఎవరికి ఓటు వేసినా బీజేపీకి వేసినట్లేనని చెప్పారు.