ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కృష్ణాజిల్లా జగ్గయ్యపేట వేదాద్రి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. 24 మందికి గాయాలయ్యాయి. అయితే కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం వేదాద్రి దగ్గర ట్రాక్టర్ లారీ ఢీకొన్న ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఆ ఘటనలో మరో ఇద్దరు ఆసుపత్రికి తరలించే క్రమంలో చనిపోయారు.
కాగా ఖమ్మం జిల్లా మధిర మండలం గోపవరం నుంచి 25 మందితో ట్రాక్టర్లలో వేదాద్రి లక్ష్మీ నరసింహ స్వమి దర్శనానికి వెళ్లి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆలయ సమీపంలోనే ఈ ప్రమాదం జరగడం అంతటా కలకలం రేపుతోంది. ప్రమాద సమయంలో ట్రాక్టర్లో 30 మందికిపైగా ప్రయాణిస్తున్నట్లు సమాచారం అందుతుంది. అయితే ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. కాగా మృతులు అంతా కూడా తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మధిర వాసులుగా పోలీసులు గుర్తించారు.