ఢిల్లీ నుంచి మార్చి 13వ తేదీన రామగుండం వరకు ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ బోగిలో కరోనా పాజిటివ్ బాధితులు 8మంది ప్రయాణించారు. ఆ సమయం లో వారితో పాటు ఎస్ 9 బోగిలో ప్రయాణికుల వివరాలు కొంత తెలిశాయని సమాచారం. ఆ ప్రయాణికుడి తో కలిసి ప్రయాణం చేసిన వాళ్లను ఆ బోగీలో ప్రయాణం చేసిన ప్రయాణికులను గుర్తించే ప్రయత్నం చేసింది. వారిలో 10 మంది ఇండోనేషియా నుంచి వచ్చిన వ్యక్తులు కూడా ఉన్నారు. ఈ పదిమంది కరీంనగర్ వెళ్లారు. ఇందులో ఏడుగురికి కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇండోనేషియాకు చెందిన ఏడుగురితో పాటుగా రామగుండంలో దిగిన ఓ వ్యక్తికి కూడా కరోనా పాజిటివ్ వచ్చినట్టు తేలడం తో ఆ బోగీలో ప్రయాణం చేసిన మిగతా వారి వివరాలు ప్రభుత్వం సేకరిస్తోంది.
ఈ క్రమంలో ఆ రైలులో ఎస్ 9 బోగి నుంచి ప్రయాణికులు ఎక్కడ దిగారో కొంత సేకరించారంట. దక్షిణ మధ్య రైల్వే వివరాల ప్రకారం.. మొత్తం 90 మంది 13 స్టేషన్లలో దిగినట్టు రైల్వే అధికారులు తెలిపారు. ఝాన్సీ 4 భోపాల్ 6 నాగ్పూర్ 4 రామగుండం 14 కాజీపేట 4 కాచిగూడ 33 మహబూబ్నగర్ 1 కర్నూలు 11 ఎర్రగుంట్ల 4 కడప 3 డోన్ 2 రేణిగుంట 1 తిరుపతిలో ముగ్గురు దిగినట్టు వెల్లడైంది. ఆ జాబితాను తీసుకుని వెంటనే ప్రభుత్వ అధికారులు ప్రయాణికుల ఫోన్ నంబర్లు పేర్లు తీసుకొని వారిని సంప్రదిస్తున్నారు. వారిని గుర్తించి వారి ఆరోగ్య వివరాలు తెలుసుకోనున్నారు. వారికి కరోనా సోకిందంటే వెంటనే అదుపులోకి తీసుకుని ఆ వైరస్ వ్యాప్తి తీవ్రంగా కాకుండా చర్యలు తీసుకోనున్నారు.