ఏపీ టీడీపీ హైకమాండ్ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసింది. కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర, BT నాయుడు లకు అవకాశం కల్పించింది. మరో సీటును చివరి నిమిషంలో బీజేపీకి కేటాయించారు. ఇప్పటికే ఒక స్థానం జనసేనకు కేటాయించగా.. ఆ పార్టీ నుంచి పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు నామినేషన్ వేశారు. కాగా టీడీపీలో చాలామంది నేతలు ఎమ్మెల్సీ స్థానాన్ని ఆశించారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, దువ్వారపు రామారావు, మాజీ మంత్రి జవహర్, కొమ్మాలపాటి శ్రీధర్, అశోక్‌బాబు, టీడీ జనార్ధన్ వంటి వారు గట్టి ప్రయత్నం చేశారు.





