రేషన్ కార్డులు ఉన్నవారికి ఆంధ్ర ప్రదేశ్ సర్కార్ శుభవార్త చెప్పింది. రేషన్ కార్డులు ఉన్నవారికి సబ్సిడీపై కందిపప్పు అందించేందుకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఈ నెల 23వ తేదీ నాటికి నిల్వ కేంద్రాలకు సరుకు తరలించారు. కేజీ రూ. 67 చొప్పున అందించనుంది.
ఇప్పటికే పలు జిల్లాల్లో అమలు చేస్తుండగా…జనవరి నుంచి అన్ని జిల్లాల్లో పూర్తిస్థాయిలో అమలు చేయనుంది. అటు తొలిసారిగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పండిన కందులను రైతుల నుంచి కొనుగోలు చేసి, సరాఫరా చేయనుంది.
స్థానిక రైతుల నుంచి మద్దతు ధరకు కందుల కొనుగోలుకు ఏర్పాట్లు చేశారు. ప్రకాశం, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో 35 వేల టన్నుల సేకరణకు కసరత్తు చేసింది ఆంధ్ర ప్రదేశ్ సర్కార్. మరింత తక్కువ రేటుకు గోధుమ పిండి సరఫరాకు ప్రతిపాదనలు చేసింది. చౌక దుకాణాల్లో అందుబాటులోకి పంచదార, చిరుధాన్యాల నిల్వలు వచ్చాయి. జీసీసీ స్టోర్లలోను సబ్సిడీపై కందిపప్పు విక్రయాలకు ప్రోత్సాహం కల్పించింది సర్కార్.