యాపిల్ లవర్స్ ఆరో తరానికి గెట్ రెడీ !

apple ipad 6th generation

యాపిల్ ఐప్యాడ్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఎందుకంటే ల్యాప్ టాప్ లతో పోలిస్తే ఎంతో తేలిగ్గా ఉండే అలాగే వర్క్ ఫాస్ట్ గా ఉండే ఐప్యాడ్ లని అభిమానించేవారు ప్రపంచంలో నలుదిక్కులా కనపడతారు. అలాంటిది ఇప్పుడు కొత్త ఆరో తరం ఐప్యాడ్ ప్రవేశపెట్టిన యాపిల్, ఇది ల్యాప్ టాప్ లు, ఇతర కంప్యూటర్లతో పోలిస్తే ఎంత సులభంగా వాడవచ్చో తెలిపేందుకు కొన్ని వీడియోలు విడుదల చేసింది. 15 సెకన్ల యాడ్స్ లో కఠినతరమైన పనులను ఐప్యాడ్ ఎలా సులువుగా చేయగలదో వివరించారు. పర్యటన, నోట్స్ తయారీ, రాతపని, ఇతరత్రా వ్యవహారాలను ఎంత సులభంగా చేయవచ్చో తెలిపారు. ఈ యాడ్స్ ను యాపిల్ ఇంటర్నేషనల్ యూట్యూబ్ ఛానెళ్లలో విడుదల చేశారు. మరో 90 సెకన్ల యాడ్ లో ఫేస్ ఐడీ గురించి ప్రత్యేకంగా వివరించారు. ఈ ఫేస్ ఐడీ యాడ్ ప్రకారం చూస్తే యాపిల్ త్వరలో విడుదల చేయబోయే తన కొత్త ఐప్యాడ్ మోడళ్లలో ఫేస్ ఐడీని ప్రవేశపెట్టబోతోందని భావిస్తున్నారు.