కిడారి హత్యలో మావోలకు సహకరించింది అత్యంత నమ్మకస్తులే…!

Araku Mla Kidari Murder Case Police Investigate

అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల హత్య కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. అయితే, కిడారి, సోమల హత్య చేసేందుకు ప్రయత్నించిన మావోయిస్టులకు ఇద్దరు స్థానిక నేతల నుంచి పూర్తి సహకారం అందినట్టు గుర్తించారు. వీరిలో ఒకరు మండల స్థాయి నేతకాగా, మరొకరు గ్రామస్థాయిలో కీలకంగా వ్యవహరిస్తున్నట్టు తెలిసింది. అలాగే వీరిలో ఓ నేత గంజాయి, అక్రమ రవాణా లాంటి అసాంఘిక కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. ఈ ఇద్దరూ కిడారికి అత్యంత నమ్మకస్థులుగా వ్యవహరిస్తూనే మావోయిస్టుల వ్యూహంలో పాలుపంచుకున్నట్టు పోలీసులు గుర్తించారు.

kidari-case
వీరిని అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులకు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల హత్యలో వారి పాత్రపై కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. జంట హత్యల్లో తమ పాత్ర ఉందని వారు విచారణలో ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న వీరి నుంచి మరిన్ని వివరాలు సేకరించి మరో రెండు రోజుల్లో అరెస్టు చేసే అవకాశముంది. వీరే పథకం ప్రకారం లివిటిపుట్టు గ్రామానికి కిడారిని రాబట్టి, మావోయిస్టుల ఉచ్చులో చిక్కుకునేలా చేయడంలో వీరు క్రియాశీలకంగా వ్యవహరించినట్టు అంగీకరించారు. అయితే మావోలకు ఎందుకు సహకరించాల్సి వచ్చింది? అనే అంశం మీద సంబంధించి అత్యంత కీలక విషయాలను పోలీసులు రాబట్టారట. అలాగే హత్యలు జరిగిన రెండు రోజుల తర్వాత వరకు వారు లివిటిపుట్టు పరిసర ప్రాంతాల్లోనే ఉన్నారని కూడా పోలీసులు గుర్తించారు. వీటికి సంబందించి మరో రెండు రోజుల్లో పోలీసులు కీలక ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది.

kidari-murder