ఎన్టీఆర్, త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘అరవింద సమేత’ చిత్రం ఆడియో విడుదలకు సంబంధించిన వార్తలు గత కొన్ని రోజులుగా మీడియాలో తెగ వస్తున్న విషయం తెల్సిందే. హరికృష్ణ మరణం తర్వాత ఎన్టీఆర్ మరియు బాలకృష్ణ ఒక్కటి అయిన కారణంగా ‘అరవింద సమేత’ చిత్రం ఆడియో వేడుకలో బాలకృష్ణ పాల్గొంటాడు అంటూ ప్రచారం జరిగింది. నందమూరి అభిమాల్లో ఆ ప్రచారం చాలా సంతోషంను నింపింది. ఆ తర్వాత మహేష్‌బాబు కూడా ఈ ఆడియో వేడుకలో పాల్గొంటాడు అంటూ వార్తు వచ్చాయి. ఎన్టీఆర్‌కు మిత్రుడు అవ్వడంతో పాటు, త్రివిక్రమ్‌కు మహేష్‌బాబుకు మద్య సన్నిహిత సంబంధాలున్నాయి. ఆ కారణంగానే మహేష్ వచ్చే అవకాశాలు లేకపోలేదు అంటూ వార్తలు వచ్చాయి.
ఈ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్ చిన్న గెస్ట్ రోల్‌లో కనిపించబోతున్నాడని, ఆ కారణంగా ఈ చిత్రం ఆడియో వేడుకలో ఆయన కూడా పాల్గొంటాడు అంటూ పుకార్లు షికార్లు చేశాయి. ఈ ముగ్గురిలో ఎవరు వస్తారా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులకు షాక్ ఇస్తూ ఆడియో విడుదల కార్యక్రమం లేదు అంటూ చిత్ర యూనిట్ సభ్యులు తేల్చి పారేశారు. ఆడియో విడుదల కార్యక్రమం నిర్వహించేందుకు సమయం లేదని, షూటింగ్ ఇంకా పూర్తి కాని కారణంగా ఆడియో విడుదల వేడుకను నిర్వహించడం లేదు అంటూ చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. సినిమా విడుదలకు ముందు ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ వేడుకలో అయినా పై ముగ్గురిలో ఎవరో ఒకరు పాల్గొనాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.