‘యాత్ర’లో జగన్‌గా గోవిందుడు?

Vijay Devarakonda To Jagan In YSR Biopic

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘యాత్ర’. మహి రాఘవ్‌ దర్శకత్వంలో భారీ ఎత్తున తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాజశేఖర్‌ పాత్రను మయాళ సూపర్‌ స్టార్‌ మమ్ముటి పోషిస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే విడుదలైన పోస్టర్‌, టీజర్‌, సాంగ్‌ సినిమా స్థాయిని అమాంతం పెంచేశాయి. ఇక ఈ చిత్రంలో ముఖ్య పాత్రలకు గాను పలువురు నటీనటులు నటిస్తున్న విషయం తెల్సిందే. అయితే జగన్‌ పాత్రను పోషించేది ఎవరు అంటూ గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతుంది. యాత్రలో జగన్‌ పాత్ర కాస్త తక్కువగా ఉంటుందని సమాచారం అందుతుంది. అందుకే ఇంకా ఆ పాత్ర కోసం నటుడిని ఎంపిక చేయలేదు.

ysr biopic yatra

ఆమద్య తమిళ నటుడు ఒకరు జగన్‌ పాత్రను పోషించేందుకు సిద్దం అయినట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ వార్తల్లో నిజం లేదు అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు క్లారిటీ ఇచ్చారు. ఇక తాజాగా ‘యాత్ర’ చిత్రంలో విజయ్‌ దేవరకొండను జగన్‌ పాత్రలో నటింపజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా సమాచారం అందుతుంది. ‘అర్జున్‌ రెడ్డి’, ‘గీత గోవిందం’ చిత్రంతో విజయ్‌ దేవరకొండ స్థాయి అమాంతం పెరిగింది. భారీ స్థాయిలో ఈయన క్రేజ్‌ పెరిగిన కారణంగా ‘యాత్ర’ చిత్రంలో ఈయన ఉంటే తప్పకుండా మంచి బిజినెస్‌ అవుతుందనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. యాత్ర చిత్రంలో జగన్‌ పాత్రపై విజయ్‌ దేవరకొండ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. కేవలం 15 రోజుల డేట్స్‌కు భారీ పారితోషికంను ఆఫర్‌ చేసినట్లుగా సమాచారం అందుతుంది. మరి విజయ్‌ దేవరకొండ నిర్ణయం ఏంటో తెలియాల్సి ఉంది.

Vijay Devarakonda in Yathra