పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. ఈమూవీని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తుండగా దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
ప్రారంభం నాటి నుండి అందరిలో భారీ అంచనాలు ఏర్పరిచిన ఈమూవీ ఇప్పటికే కొంత మేర షూటింగ్ జరుపుకోగా, త్వరలో నెక్స్ట్ షెడ్యూల్ ని ప్రారంభించేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తోంది. విజయ్ నటించిన తమిళ సూపర్ హిట్ తేరి కి రీమేక్ గా తెరకెక్కుతోంది.
ఈ మూవీ.అయితే లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం ఈ మూవీ పక్కా మాస్ యాక్షన్ జానర్ లో సాగనుండడంతో పాటు హీరో ఎలివేషన్ సీన్స్, మాస్ ఫైట్స్, మాస్ డైలాగ్స్ వంటివి ఉంటాయి తప్ప ఇందులో ఏమాత్రం పొలిటికల్ డైలాగ్స్ కానీ, సెటైర్స్ వంటివి కానీ ఉండబోవని యూనిట్ నుండి వచ్చిన సమాచారం అని తెలుస్తోంది.
సూపర్ డూపర్ హిట్ గబ్బర్ సింగ్ తరువాత తాను మరియు పవర్ స్టార్ ల కలయికలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీని అన్ని వర్గాల ఆడియన్స్ ని ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్ ని ఆకట్టుకునేలా దర్శకడు హరీష్ శంకర్ అద్భుతంగా తెరకెక్కిస్తున్నట్లు చెప్తోంది యూనిట్. అయితే ఈ మూవీ వచ్చే ఏడాది వేసవిలో ఆడియన్స్ ముందుకి వచ్చే అవకాశం కనపడుతోంది.