మీరు బిజినెస్ ప్రారంబించాలనుకుంటున్నారా ? అయితే ఈ గుడ్ న్యూస్ మీకే

మీరు బిజినెస్ ప్రారంబించాలనుకుంటున్నారా ? అయితే ఈ గుడ్ న్యూస్ మీకే

సూక్ష్మ, మధ్య తరహా వ్యాపారులకు ఊతం ఇచ్చేలా మరో కొత్త పథకాన్ని తీసుకొచ్చేందుకు కేంద్రం ప్లాన్ చేస్తోంది. వీరి  కోసం గత ఏడాది ’59 నిమిషాల లోన్’ పథకాన్ని తెచ్చిన మోదీ సర్కార్… ఈసారి చిన్న వ్యాపారుల కోసం జీఎస్టీ ఎక్స్‌ప్రెస్ స్కీమ్‌ను ప్రవేశపెట్టేందుకు యోచిస్తోంది. CNBC AWAAZ కు అందిన విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు 6 నెలలుగా క్రమం తప్పకుండా జీఎస్టీ రిటర్న్స్ దాఖలు చేసే వ్యాపారులకు కోటి రూపాయల వరకు లోన్ ఇవ్వాలని భావిస్తోంది. ఈ పథకానికి ఇప్పటికే ఆర్థికశాఖ ఆమోదముద్ర వేసినట్లుగా తెలుస్తోంది.

జీఎస్టీ ఎక్స్‌ప్రెస్ లోన్ పథకం అమల్లోకి వస్తే జీఎస్టీని సక్రమంగా చెల్లించే వ్యాపారులకు బ్యాంకులు ఇకపై రెడ్ కార్పెట్ పరుస్తాయి. ఎలాంటి ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్ లేకుండానే కోటి రూపాయల వరకు లోన్ మంజూరు చేస్తారు. ప్రస్తుతం ఉన్న వ్యాపారాన్ని మరింత విస్తరించేందు చిన్న వ్యాపారులకు ఈ పథకం ఉపయోగపడుతుంది. కంపెనీ టర్నోవర్, అమ్మకాలు, కొలేటరల్ ఆధారంగా లోన్ ఎంత ఇవ్వాలనేది బ్యాంకులు నిర్ణయిస్తాయి. ఈ పథకం ద్వారా రూ. 10 లక్షల నుంచి కోటి వరకు లోన్ అందిస్తారు.