అర్జున్ రెడ్డి అవకాశం మిస్ అయింది అంటున్న బాలీవుడ్ నటుడు

అర్జున్ రెడ్డి అవకాశం మిస్ అయింది అంటున్న బాలీవుడ్ నటుడు

‘అర్జు్న్ రెడ్డి’తో  రౌడీ హీరో విజయ్ దేవరకొండకి వచ్చిన క్రేజ్ అంతా ఇంత కాదు. చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డి బాలీవుడ్ లో కూడా నిర్మించి మంచి హిట్ పొందారు.‘అర్జు్న్ రెడ్డి’హిందీ రీమేక్‌గా వచ్చిన ‘కబీర్ సింగ్’ చిత్రంలో బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్‌ కథానాయకుడు. మొదట తనకే కబీర్ సింగ్ సినిమాలో నటించే అవకాశం వచ్చిందని ప్రముఖ బాలీవుడ్ నటుడు-నిర్మాత బోనీ కపూర్, మోనా షౌరేల కుమారుడు ప్రముఖ బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ అన్నారు.నటునిగానేకాక టెలివిజన్ రియాలిటీషోకి వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించిన ఈ హీరో కొన్ని కారణాల వల్ల దర్శకుడు సందీప్ రెడ్డి వంగా షాహిద్ కపూర్‌ను ఎంపిక చేసుకున్నారని తెలిపారు.

అర్జున్ రెడ్డి రీమేక్‌లో అర్జున్ కపూర్‌ని ఎంపిక చేసుకోవాలన్న ఉద్దేశంతో అర్జున్ కపూర్ 2018లో నటించిన ‘ముబారక’అనే సినిమా నిర్మాతలైన అశ్విన్,మురాద్‌లు కలిసి అర్జున్ రెడ్డి రీమేక్ రైట్స్ కొనుక్కున్నారట. కానీ సందీప్ రెడ్డి షాహిద్ కపూర్‌ను ఎంపిక చేసుకోవడం వల్ల మంచిదే అయింది,బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న కబీర్ సింగ్ లో షాహిద్ నటన అద్బుతం అని అర్జున్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.