రామాయణం చదివిన రామ చక్కని దర్శకుడు

రామాయణం చదివిన ‘రామ చక్కని సీత’ దర్శకుడు

శుక్రవారం రిలీజ్‌ అయిన ‘రామ చక్కని సీత’ దర్శకుడు శ్రీహర్ష మండ మాట్లాడుతూ నేను విజయవాడలో పుట్టిపెరిగి చిన్నప్పుడు స్కూల్లో సాంస్కృతిక కార్యక్రమాలల్లో ఎక్కువగా పాల్గొనేవాణ్ణి, ఇందులో రాణిస్తావు అని టీచర్లు మెచ్చుకునేవారు అని తెలిపారు.సినిమాల్లోకి రావాలనే ఆలోచన బాల్యంలోనే వచ్చిందిని చెప్పారు. వీవీ వినాయక్ ‘నాయక్‌’ సినిమాకు తాను చివరి అప్రెంటిస్‌, ఇంకా ఓంకార్‌గారి దగ్గర ‘రాజుగారి గది2’సినిమా, దర్శకుడు దశరథ్‌ గారి దగ్గర ‘శౌర్య’సినిమాలకి పనిచేశారని చెప్పారు.

‘రామచక్కని సీత’స్నేహితుడు ఫణితో కలసినిర్మించారు.క్లైమాక్స్‌లో కన్నీళ్లువచ్చాయని చెప్పడం హ్యాపీగా అనిపించిందని,రివ్యూలు పాజిటివ్‌గా వస్తున్నాయని,ప్రేక్షకుల మంచి స్పందన వస్తుందని తెలిపారు.

నాలుగేళ్ల కింద వచ్చిన తన “వై మేల్‌ ఈజ్‌ ఏ జోక్‌” వీడియోకి వచ్చిన ఒక కామెంట్‌ వల్ల వచ్చిన అశక్తితో రామాయణం మొత్తం..సుమారు 8వెర్షన్లు చదివాను,ప్రస్తుత పరిస్థితుల్లో రాముడు, సీత లాంటి పాత్రలుంటే ఎలా ఉంటుందనే ఆలోచనతోనే ‘రామ చక్కని సీత’ చిత్రాన్ని తీశాను’ అని చెప్పారు. ప్రస్తుతం తనదగ్గర 17కథలు రెడీగా ఉన్నాయి.ఏ సినిమా చేస్తాననేది త్వరలో చెబుతానన్నారు.