టాలీవుడ్లో సెన్సెషన్ సృష్టించిన సూపర్ హిట్ సినిమా అర్జున్ రెడ్డి. ఈ ఒక్క సినిమా యంగ్ హీరో విజయ్ దేవరకొండను టాలీవుడ్ సెన్సేషనల్ హీరోగా మార్చేసింది. అంతేకాదు ఈ సినిమాతో విజయ్ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కెరీర్‌ను తార స్థాయికి చేర్చిన సినిమా అర్జున్ రెడ్డి. అందుకే ఈ సినిమా ఇతర భాషల్లోనూ రీమేక్ చేశారు.
తెలుగులో సూపర్ హిట్ అయిన అర్జున్ రెడ్డి సినిమాను బాలీవుడ్లో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేశారు. షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాను సందీప్ దర్శకత్వంలోనే తెరకెక్కించారు. బాలీవుడ్ నెగెటివ్ టాక్‌తోనే 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సత్తా చాటాడు అర్జున్ రెడ్డి. కోలీవుడ్ లోనూ అర్జున్ రెడ్డి కథ సత్తా చాటేందుకు రెడీ అవుతోంది.
అయితే త్వరలోనే అభిమానుల కోరిక నెరవేరనుందని తెలుస్తోంది. సందీప్ రెడ్డి వంగా, విజయ్ దేవరకొండ కాంబినేషన్లో మరో సినిమాకు రంగం సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని సందీప్ అధికారికంగా ప్రకటించాడు. ఇటీవల ఓ అవార్డ్స్ ఫంక్షన్లో మాట్లాడిన సందీప్ త్వరలోనే విజయ్‌తో సినిమా చేయబోతున్నట్టుగా తెలిపాడు. అయితే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు ఉంటుంది, ఎలాంటి కథతో ఉంటుంది అన్న విషయంపై మాత్రం సందీప్ క్లారిటీ ఇవ్వలేదు.