అయితే దేశంలో అసాంఘీక శక్తులను ఏరివేసేందుకు భద్రతాదళాలు సిద్ధమయ్యాయి. ఈ సంవత్సరం మొదటినుండి ఇప్పటివరకు మొత్తం 100 మంది ఉగ్రవాదులను మన జవాన్లు కాల్చి చంపారు. తాజాగా శనివారం ఉల్లార్ గ్రామంలో సైనికులు గాలింపు చర్యలు సాగిస్తుండగా.. ఉగ్రవాదులు కాల్పులు జరపారు. ఈ కాల్పుల్లో జవాన్లు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ ఉగ్రవాది మరణించిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా జమ్మూకాశ్మీర్ లో మరోసారి ఎన్కౌంటర్ జరిగింది. అనంత్‌నాగ్ జిల్లాలోని కుల్చోహకాశ్మీర్ లోర్ సైనికులు లో ఈ ఎన్కౌంటర్ జరిపారు. కాగా భద్రతాదళాల కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని పోలీసులు వెల్లడించారు. అయితే ఇంకా ఘటనా స్థలంలో ఎదురుకాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి.