‘బాయ్స్‌ లాకర్‌ రూం’ సభ్యుడు అరెస్ట్.. మరింతమంది కోసం.

సోషల్‌ మీడియాలో అశ్లీల చిత్రాలను షేర్‌ చేసిన ఓ విద్యార్థిని ఢిల్లీ సైబర్‌ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు ఇచ్చిన సమాచారంతో మరికొంత మంది ఆకతాయిలను గుర్తించేందు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ‘బాయ్స్‌ లాకర్‌ రూం’ పేరుతో కొంతమంది యువకులు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ అకౌంట్‌ క్రియేట్‌ చేసి.. అమ్మాయిలపై అకృత్యాలకు పాల్పడాలంటూ ఇతరులను రెచ్చగొట్టిన విషయం తెలిసిందే.

అంతేకాకుండా తమ తోటి విద్యార్థినుల ఫొటోలు మార్ఫ్‌ చేసి.. వారి గురించి అశ్లీల సంభాషణలు కూడా రాశారు. ఇదే విషయాన్ని అదే స్కూలుకు చెందిన ఓ బాలిక గుర్తించి.. ట్విటర్‌ వేదికగా వారి బాగోతాన్ని బహిర్గతం చేసింది. దీంతో ఆ విషయం వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన స్క్రీన్‌షాట్లు వైరల్‌ కావడంతో నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందించారు. ఆ యువకులపై చర్య తీసుకోవాలంటూ ఢిల్లీ పోలీసులను ట్యాగ్‌ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చిది.