ఢిల్లీలో కూరగాయల అమ్మకందారుని కొట్టిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఒక వ్యక్తి కూరగాయల అమ్మకందారుని పేరు అడగడం ఆ తర్వాత కర్రతో కొట్టడం వంటి ఘటనలు చేసుకోవడంతో పోలీసులు రంగంలోకి దిగి ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని తాజ్పూర్ రహదారి సమీపంలో కూరగాయల అమ్మకందారుని కర్రతో కొట్టాడనే ఆరోపణతో ఒక వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే టూర్ అండ్ ట్రావెల్ వ్యాపారం చేస్తున్న ప్రవీణ్ బబ్బర్ గా నిందితుడిని పోలీసులు గుర్తించారు.
కాగా లాక్ డౌన్ సమయంలో కూరగాయల విక్రేతను అక్కడి నుండి తరలించమని తాను పలుమార్లు కోరినట్లు బబ్బర్ పేర్కొన్నాడు.. కాని అతను ఎంతమాత్రం అలా చేయకపోవడంతో అందుకు బబ్బర్ కోపంతో కూరగాయల అమ్మకందారునిపై దాడి చేశాడని పోలీసు అధికారి తెలిపారు. ఈ కేసులో అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి సెక్షన్ 153 (రెచ్చగొట్టడం), 355 (క్రిమినల్ ఫోర్స్), 298 (మతపరమైన భావాలను గాయపరిచే ఉద్దేశం), 323 (స్వచ్ఛందంగా బాధ కలిగించేది) కేసులు పెట్టామని పోలీసులు స్పష్టం చేశారు.