కొంప ముంచిన బెట్టింగ్ – పట్టుబడినఫ్రాంచైజీ యజమాని

కొంప ముంచిన బెట్టింగ్ - పట్టుబడినఫ్రాంచైజీ యజమాని

మన ఇండియాలో క్రికెట్ కి ఎంత క్రేజ్ ఉందొ తెలియని విషయం కాదు. దీనికి తగ్గట్టు బెట్టింగ్ కూడా పెరుగుతుంది.’ స్కోరెంత’,’ట్రెండింగ్ ఎంత’ అనే మాటలు వింటూనే ఉన్నాం.

మరోసారి ఆ మాట తమిళనాడులో వినిపించింది. ఇది మరిచిపోకముందే ఇంకో బెట్టింగ్ వెలుగులోకి వచ్చింది. బెట్టింగ్‌ మన దేశంలో చట్టబద్ధంకాదు.

ఫ్రాంచైజీ యజమానే బెట్టింగ్‌కు పాల్పడ్డాడు. తాజాగా విజయవంతంగా కర్ణాటక ప్రీమియర్‌ లీగ్‌(కేపీఎల్‌) ముగిసింది. ఈ కేపీఎల్‌లో ఫ్రాంచైజీ యజమాని​ అలీ ఆష్వాక్‌ బెట్టింగ్‌కు పాల్పడ్డాడని వెలుగులోకి వచ్చింది. ఆ యజమానిని దుబాయ్‌ బుకీతో కలిసి బెట్టింగ్‌లకు పాల్పడ్డాడని బెంగళూరు సిటీ క్రైం పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ విషయాన్నీ బెంగళూరు జాయింట్‌ పోలీస్‌ కమిషనర్‌ ఫ్రాంచైజీ యజమాని అంగీకరించడాని తెలిపారు.

ప్రభుత్వం ఆలోచించి చట్టం చేస్తే ఈ బెట్టింగ్‌ ఎవరు చేస్తున్నారు అనేది సులభంగా తెలుస్తుకోవచ్చు. దీనికన్నా ముందు తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ జరిగినపుడు అజిత్‌ సింగ్‌ షెకావత్‌(బీసీసీఐ అవినీతి నిరోధ విభాగం చీఫ్‌),బెట్టింగ్ ని చట్టబద్ధం చేయడం ద్వారా చట్టవ్యతిరేకులకు కష్టమవుతుంది అని తెలిపారు.