సినీ నటుడు హరికృష్ణ ఆకస్మిక మరణం తెలుగువారందరినీ షాక్ గురిచేయగా వారి కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం నిన్న హరికృష్ణ సోదరుడు బాలకృష్ణ ఇంట ఒక శుభకార్యం జరగాల్సి ఉంది. అయితే అన్న ఆకస్మిక మరణంతో కుప్పకూలిన బాలకృష్ణ ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసుకుని దుఃఖాన్ని దిగమింగి అన్నాను ఉంచిన హాస్పిటల్ కు బయలుదేరారట.
పూర్తి వివరాలలోకి వెళితే తాజాగా బాలకృష్ణ రెండో సారి తాత అయిన సంగతి తెలిసిందే. ఆయన రెండవ కుమార్తె తేజస్విని – శ్రీ భరత్ దంపతులకు పండంటి మగ బిడ్డ జన్మించాడు. అయితే అంతా అనుకున్నట్టు జరిగితే నిన్న ఉదయం వారింట్లో ఆ బాబుకు అన్నప్రాసన చేయాల్సి ఉంది. అయితే బాలకృష్ణ కుటుంబం అంతా ఆ కార్యక్రమంలో ఉండగా ఈ దుర్వార్త వినాల్సి వచ్చింది. విన్న కొద్దిసేపు వరకు ఆయనకు నోట మాట రాలేదని ఆయన సన్నిహుతులు చెబుతున్నారు.