నేటి నుంచే ఆసియా కప్….ఏడుసార్లు విజేతగా టీమిండియా ..

Asia Cup
Asia Cup

నేటి నుంచే ఆసియా కప్‌ పోరు ప్రారంభం కానుంది. టీమిండియా ప్లేయర్లు ఆసియాకప్ కొట్టేందుకు సిద్ధమయ్యారు. గత ఆరు రోజులుగా బెంగళూరు శివారులోని ఆలూర్ క్యాంప్ లో నిర్వహించిన ప్రాక్టీస్ సెషన్లలో 17 మంది ప్లేయర్లు పాల్గొన్నారు. శిక్షణ శిబిరం నిన్నటితోనే ముగిసింది.

ఇక ఇవాళ భారత జట్టు.. Practice కు బయలుదేరనుంది. అయితే, నేటి నుంచి ఆసియా కప్ స్టార్ట్ అవుతుండగా… టైటిల్ ఫేవరెట్ గా భారత్ బరిలోకి దిగుతుంది. ఇప్పటివరకు 15 సార్లు ఆసియా కప్ జరగగా… అందులో ఏడుసార్లు ఇండియా విజేతగా నిలిచింది. 1984, 1988, 1990-91, 1995, 2010, 2016తో పాటు చివరిసారిగా భారత్ 2018 లో టైటిల్ గెలిచింది. ఇక ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆడిన 49 మ్యాచుల్లో టీమ్ ఇండియా 31 మ్యాచులు విజయం సాధించింది.