అధికార‌ప‌క్షాలు రెండూ అప్పుల్లోనే…

association of democratic reforms announced TDP and TRS loans

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

విభ‌జ‌న బాధిత ఆంధ్ర‌ప్ర‌దేశ్ అప్పుల్లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో భాగంగా వ‌చ్చిన అప్పుల‌తో పాటు… విభ‌జ‌నలో జ‌రిగిన అన్యాయం కార‌ణంగా రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది. అదే స‌మ‌యంలో విభ‌జ‌న వ‌ల్ల వ‌చ్చిన లాభాల‌తో తెలంగాణ మాత్రం అత్యంత సంపన్న రాష్ట్రంగా వెలుగొందుతోంది. ఈ ప్ర‌కారం చూస్తే ధ‌నిక రాష్ట్రాల్లో ప్ర‌భుత్వం న‌డిపే పార్టీలు సంప‌న్నంగా… పేద‌ రాష్ట్రాల్లోని అధికార పార్టీలు అప్పుల‌తోనూ నిండి ఉండాలి. అయితే తెలుగు రాష్ట్రాల ప‌రిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. సంప‌న్న రాష్ట్ర అధికార‌పార్టీ… పేద‌రాష్ట్ర అధికార పార్టీ రెండూ అప్పుల్లోనే కూరుకుపోయిఉన్నాయి. వివ‌రంగా చెప్పాలంటే… ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని అధికార టీడీపీ, తెలంగాణ‌లోని అధికార టీఆర్ ఎస్ రెండూ అప్పుల్లో ఒక‌దానితో ఒక‌టి పోటీప‌డుతున్నాయి. ఢిల్లీకి చెందిన అసోసియేష‌న్ ఆఫ్ డెమోక్ర‌టిక్ రిఫామ్స్ త‌న నివేదిక‌లో ఈ విష‌యం వెల్లడించింది.

ఈ నివేదిక ప్ర‌కారం దేశంలోని ప్రాంతీయ‌పార్టీల్లో అప్పుల ప‌రంగా టీఆర్ ఎస్ తొలిస్థానంలో, టీడీపీ రెండో స్థానంలో ఉన్నాయి. 2015-16 ఏడాదికి టీఆర్ ఎస్ కు రూ.15.97కోట్ల అప్పు ఉంటే… టీడీపీకి రూ.8.18 కోట్ల రుణ‌భారం ఉంది. ఇక ఆస్తుల ప‌రంగా ప్రాంతీయ పార్టీల్లో అత్యంత సంప‌న్న పార్టీ… ప్ర‌స్తుతం ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లో అధికారానికి దూరంగా ఉన్న స‌మాజ్ వాదీ పార్టీ. యూపీ మాజీ ముఖ్య‌మంత్రి అఖిలేశ్ యాదవ్ కు చెందిన స‌మాజ్ వాదీ పార్టీకి 2015-16 లో ప్ర‌క‌టించిన వివ‌రాల ప్రకారం రూ.634.96కోట్ల ఆస్తులున్నాయి. రూ. 257.18 కోట్ల ఆస్తుల‌తో త‌మిళ‌నాడుకు చెందిన డీఎంకె, రూ. 224.84 కోట్ల‌తో త‌మిళ‌నాడు అధికార ప‌క్షం అన్నాడీఎంకె ఎస్పీ త‌ర్వాతి స్థానాల్లో నిలిచాయి. పార్టీల స్థిరాస్తులు, లోన్లు, అడ్వాన్సులు, డిపాజిట్లు, టీడీఎస్, పెట్టుబ‌డులు, ఇత‌ర ఆస్తులు క‌లిపి ఈ నివేదిక రూపొందించారు. ఇక ఏపీకి చెందిన మ‌రో రాజ‌కీయ‌పార్టీ వైస్సార్ సీపీ ఆస్తులు రూ. 3.765 కోట్ల‌ని నివేదిక వెల్ల‌డించింది.