Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నాని హీరోగా నటించిన ‘ఎవడే సుబ్రమణ్యం’ చిత్రంలో ఒక ముఖ్య పాత్రను పోషించిన విజయ్ దేవరకొండ ‘పెళ్లి చూపులు’ చిత్రంతో స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. మొదటి రెండు సినిమాలు మంచి పేరును తెచ్చి పెట్టడంతో తాజాగా ‘అర్జున్ రెడ్డి’ చిత్రాన్ని విజయ్ చేయడం జరిగింది. ఈనెల 25వ తారీకున ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ కాస్త శృతిమించుతున్నాడు.
సోషల్ మీడియాలో ఆయన వ్యాఖ్యలపై విమర్శలు వచ్చినా కూడా వాటిపై మరింత ఘాటుగా స్పందిస్తూ విజయ్ తన ఆగ్రహంను వ్యక్తం చేస్తున్నాడు. తాజాగా ప్రీ రిలీజ్ వేడుకలో విజయ్ చేసిన వ్యాఖ్యలు మరింతగా చర్చనీయాంశం అవుతున్నాయి. యువ హీరోలు నాని, శర్వాలు ఏమాత్రం బ్యాక్ గ్రౌండ్ లేకుండా హీరోలుగా పరిచయం అయ్యారు. వారిలాగే విజయ్ కూడా తప్పకుండా హీరోగా ఆకట్టుకుంటాడని ఆయన గత చిత్రాలు చూస్తే అనిపించింది. కాని శర్వా, నానిలకు ఉన్నంత ఓపిక విజయ్‌కు లేదని తేలిపోయింది. ఇలాంటి ఆవేశపరుడు ఇండస్ట్రీలో ఎక్కువ కాలం ఉండలేడు. ఈ ఆవేశం కారణంగా సినిమాల్లో ఛాన్స్‌లు కూడా రావని, కొందరికి శత్రువులుగా మారే అవకాశం ఉందని, అందుకే నాని, శర్వాలను చూసి నేర్చుకోవాల్సిందిగా విజయ్‌కు ఆయన సన్నిహితులు మరియు సోషల్ మీడియా ఫాలోవర్స్ చెబుతున్నారు. మరి విజయ్ ఇప్పటికైనా తన పద్దతిని మార్చుకుంటాడా అనేది చూడాలి.
మరిన్ని వార్తలు: