Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 65వ జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమాలకు సముచిత స్థానం దక్కింది. ‘ఘాజీ’ సినిమాకు ఉత్తమ తెలుగు చిత్రంగా అవార్డు రాగా, బాహుబలి చిత్రానికి మూడు జాతీయ అవార్డులు రావడం జరిగింది. బాహుబలి చిత్రానికి ఉత్తమ పాపులర్ సినిమాగా, ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ సినిమాగా, ఉత్తమ యాక్షన్ డైరెక్షన్‌కు గాను జాతీయ స్థాయిలో అవార్డులు వచ్చాయి. అయితే బాహుబలి యాక్షన్ డైరెక్టర్ అబ్బాస్ అలీకి అవార్డు వచ్చినట్లుగా జ్యూరీ ప్రకటించింది. అయితే జ్యూరీ ప్రకటించినట్లుగా బాహుబలి మొదటి లేదా రెండవ పార్ట్‌లకు అబ్బాస్ అలీ యాక్షన్ డైరెక్టర్‌గా వ్యవహరించలేదు అంటూ నిర్మాత శోభు యార్లగడ్డ చెప్పుకొచ్చాడు.
జాతీయ అవార్డు వంటి ప్రతిష్టాత్మక అవార్డుల ఎంపికలో ఇలాంటి తప్పులు జరగడం చాలా శోచనీయం అని, ఇలాంటివి జరగడం చూస్తే అవార్డుల ఎంపికలో ఉన్న ఢొల్ల కనిపిస్తుందని ఈ సందర్బంగా సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బాహుబలి చిత్రానికి పీటర్ హెయిన్స్ స్టంట్స్ కొరియోగ్రఫీ చేయడం జరిగింది. కాని బాహుబలి యాక్షన్‌కు అబ్బాస్ అలీకి అవార్డు ఇవ్వడంపై సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం అవుతుంది. జాతీయ అవార్డుల జ్యూరీ పనితనంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తెలుగు సినిమాకు వారు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.