Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగు సినిమా సత్తా అంతర్జాతీయంగా చాటిన చిత్రం బాహుబలి 2… ఈ సినిమా ఇటీవలే చైనాలో విడుదలై అక్కడా రికార్డ్ కలెక్షన్స్ సాధిస్తోంది. హాలీవుడ్ చిత్రాలతో పోటీపడుతోంది. బాహుబలి -2కి చైనాలో ఎంత క్రేజ్ ఉందో తెలుసుకోవడానికి… ఆ దేశపు సోషల్ మీడియా వెబ్ సైట్ వీ చాట్ లో వైరల్ అవుతున్న ఫొటోలే ఉదాహరణ.
బాహుబలి-2 పాత్రలను, హాలీవుడ్ చిత్రాలు బ్లాక్ పాంథర్, ఐరన్ మ్యాన్, అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్… లోని పాత్రలను కలిపి కొత్త పోస్టర్లు తయారుచేశారు చైనా అభిమానులు. ఈ మార్ఫింగ్ పోస్టర్లు భారత్ లోనూ వైరల్ గా మారాయి. మార్వెల్-డిస్నీ సంస్థలు కలిసి రూపొందించిన సినిమాల్లోని పాత్రలతో బాహుబలిలో ప్రభాస్, అనుష్క, రమ్యకృష్ణ, కలిసి ఉన్నట్టుగా ఉన్న ఈ పోస్టర్లను నెటిజన్లు మార్వెల్ యూనివర్స్ లో మాహిష్మతి రాజ్యంగా అభివర్ణిస్తూ షేర్ చేసుకుంటున్నారు.