Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
భారత సినిమా ఇండస్ట్రీలో బాహుబలి క్రియేట్ చేయని రికార్డు లేదేమో. అన్ని అంశాల్లోనూ బాహుబలి కొత్త చరిత్రను క్రియేట్ చేసింది. జాతీయ స్థాయిలో తెలుగుసినిమా సత్తా చాటిన బాహుబలి ఇప్పుడు ఆన్ లైన్ లో ఓ రికార్డు సృష్టించింది. ప్రముఖ ఆన్ లైన్ స్ట్రీమింగ్ సర్వీస్ నెట్ ఫ్లిక్ ఈ చిత్ర ప్రసార హక్కులను కొనుగోలు చేసింది. ఇందుకోసం ఆ సంస్థ రూ. 25.50 కోట్ల భారీ మొత్తం వెచ్చించింది. ఈ సినిమాను ఇప్పుడు ఆన్ లైన్లో అధికారికంగా చూడొచ్చు. 192 దేశాల్లో ఈ చిత్రాన్ని ఆన్ లైన్ లో చూడొచ్చు. బాక్సాఫీసు దగ్గర రికార్డు కలెక్షన్లు రాబట్టుకున్న బాహుబలి ఆన్ లైన్ లోనూ భారీ మొత్తాన్ని వసూలు చేసింది. హిందీ చిత్రం దబాంగ్ ఆన్ లైన్ హక్కులను కొనుగోలు చేసిన నెట్ ఫ్లిక్ ఈ చిత్రం కోసం రూ. 20 కోట్లుమాత్రమే వెచ్చించింది. అంటే బాహుబలి స్థాయి బాలీవుడ్ లో భారీ విజయాన్ని సాధించిన దబాంగ్ ను మించిపోయిందన్నమాట. అందుకే సినిమా విడుదలై రెండు నెలలు కావొస్తున్నా…ఇప్పటికీ బాహుబలి గురించిన సంగతులు రోజూ వింటూనే ఉన్నాం. బాహుబలితో ఎస్. ఎస్. రాజమౌళికే కాదు…హీరో ప్రభాస్, ప్రతి నాయకుడు రానాతో సహా సినిమాలో నటించిన వారందరికీ, చిత్రానికి పనిచేసిన సాంకేతిక నిపుణులకూ జాతీయంగా గుర్తింపు లభించింది. వెండితెరపై సంచలనాలు క్రియేట్ చేసిన బాహుబలి ఆన్ లైన్ లో ఇంకెన్ని వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
మరిన్ని వార్తలు: