Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
చంద్రగ్రహణం నేపథ్యంలో జ్యోతిష్యలు కొందరు గ్రహణం చూస్తే అరిష్టం కలుగుతుందని హెచ్చరికలు చేస్తోంటే హేతువాదులు వాటిని తీవ్రంగా ఖండిస్తూ మూఢనమ్మకాలు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. సంప్రదాయం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో దేవాలయాలు మూతపడ్డాయి. గ్రహణం సమయంలో దేవతల శక్తి నశిస్తుందన్నది ఓ నమ్మకం. అందుకే ఆలయాలు మూసివేస్తారు. గ్రహణం విడిచిన తర్వాత సంప్రోక్షణ కార్యక్రమాలు జరిగిన తరువాతే తిరిగి దేవాలయాలు తెరుచుకుంటాయి. ఈ విషయం పక్కనపెడితే హేతువాదులు మాత్రం గ్రహణం చూడడం వల్ల ఎలాంటి సమస్యలూ ఉండవంటున్నారు. హేతువాది బాబు గోగినేని ఓ వీడియోను యూ ట్యూబ్ లో పోస్ట్ చేశారు. గ్రహణం గురించి ఎలాంటి భయాందోళనలు వద్దని సూచించారు.
గ్రహణం ఎలా ఏర్పడుతుందో సింపుల్ గా అందరికీ అర్ధమయ్యేరీతిలో వివరించారు. సూర్యుడి కాంతి భూమిపై పడినప్పుడు భూమి వెనక నీడ ఉంటుందని, చంద్రుడు భూమి చుట్టూ తిరిగే క్రమంలో ఈ నీడ చంద్రునిపై పడుతుందని, అందుకే ఆ సమయంలో చంద్రుడు కనపడడని, అదే చంద్రగ్రహణమని స్పష్టంచేశారు. నీడకు భయపడితే ఎలా అని ప్రశ్నించారు. భయాలన్నీకేవలం జ్యోతిష్యులు కల్పించిన అసత్యాలని తెలిపారు. ప్రతి 6, 585 రోజులకు ఒకసారి ఈ దృశ్యం కనపడుతుందని తెలిపారు.