ఆంధ్ర ప్రదేశ్‌లో రాజకీయంగా జనసేన అధినేత పవన్ ,టిడిపి అధినేత చంద్రబాబు కలిసి పనిచేస్తున్నారా? అబ్బే ఎవరి రాజకీయం వారు చేస్తున్నారు..,వారు ఎవరికి వారే పనిచేస్తున్నారుగా అని అనుకోవచ్చు. పైకి మాత్రం కలిసిపనిచేస్తున్నట్లు కనిపించడం లేదు. కానీ అంతర్గతంగా వారిద్దరు కలిసే పనిచేస్తున్నారు. ఇప్పటికే పొత్తు దిశగా ముందుకెళుతున్నారు. పలుమార్లు కలిసి చర్చించారు. అయితే పొత్తు అధికారికంగా ఫిక్స్ కాలేదు. ఇప్పుడు ఎవరికి వారు జనంలో తిరుగుతున్నారు.
తమ పార్టీల బలం పెంచుకునే దిశగా ముందుకెళుతున్నారు. అలాగే ఒకరి తర్వాత ఒకరు ప్రజల్లోకి వస్తున్నారు. సరిగా గమనిస్తే బాబు ప్రజల్లో ఉన్నప్పుడు పవన్ ఉండరు. అలాగే పవన్ బయటకొస్తే బాబు ప్రజల్లో ఉండరు. వారాహి మొదట విడత యాత్ర మొదలైనప్పుడు బాబు ప్రజల్లోకి రాలేదు. పార్టీ పనుల్లో బిజీగా ఉన్నారు.
రెండో విడత వారాహి యాత్ర జరిగినప్పుడు కూడా అంతే. పైగా పవన్ జనసేనకు బలం ఉన్న సీట్లలోనే పర్యటిస్తున్నారు.ఇప్పుడు బాబు శ్రీకాకుళంలో చివరి రోజు పర్యటిస్తారు. ఇక ఇటు పవన్ విశాఖలో మూడో విడత వారాహి యాత్ర మొదలుపెడతారు. అంటే బాబు టూర్ ఎండ్ అవుతుంటే, పవన్ టూర్ స్టార్ట్ అవుతుంది. మొన్నటివరకు బాబు..జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఇప్పుడు పవన్ వంతు. మొత్తానికి సర్కార్ కి చెక్ పెట్టాలని ఇద్దరు నేతలు పక్కా ప్లాన్ తో కలిసి పనిచేస్తున్నారు.