ప్రేమ దేనికి సంబంధించినదనీ చూపించిన బేబీ..?

Anand Deverakonda
Anand Deverakonda

టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ హీరోగా, యూట్యూబ్ సెన్సేషన్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా, కలర్ ఫోటో లాంటి నేషనల్ అవార్డ్ విన్నింగ్ రైటర్ సాయి రాజేష్ గారు బేబీ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు ఉదయం ఆట విడుదల అయ్యి ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభిస్తుంది . ఇప్పటికె బేబీ ప్రీమియర్ షో లు రిలీజ్ చేసారు . యూత్ ని మంచిగా ఆకట్టుకున్న బేబీ చిత్రం ఆనంద్ దేవరకొండ సినీ పరిశ్రమ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని ఒక మంచి ఘన విజయాన్ని సొంతం చేసుకున్నాడనే చెప్పొచ్చు . ఈ సినిమా కి విజయ్ బుల్గానీన్ సంగీతం పాటలతోని ఇంట్రెస్టింగ్ పోస్టర్స్ తోను మంచిగా సెట్ అయ్యింది.

ఈ చిత్రం లో మొదటి భాగంలో హీరో , హీరోయిన్ ల ప్రేమ ఎలా సాగింది ? అనే విషయాన్ని చాలా క్లుప్తంగా ప్రతి ఒక్క ప్రేక్షకుడిని హృదయాన్ని తాకే విధంగా సాయి రాజేష్ గారు చిత్రీకరించారు . మూవీ సెకండ్ హాఫ్ లో ఇరువురి ప్రేమికుల మధ్య హీరోయిన్ , ఒకరిని ప్రేమించి , మరొకరి శారీరకంగా కలవడం . ఆలా చేసిన ఎవరికీ సొంతం చేసుకున్నారనే విషయం లో సెంటిమెంట్ సీన్ లలో ఎమోషన్ ఎలా క్యారీ చేసారో తెలియాలంటే థియేటర్ కి వెళ్లి చూడాల్సిందే .

ఈ సినిమా ప్రతి ఒక్క ప్రేక్షకులని కదిలించేలా కొన్ని సీన్స్ ఉన్నాయని తెలుస్తుంది. తెలుగు తెరకి కొత్తగా పరిచయం అయినా మన తెలుగు తార వైష్ణవి చైతన్య చాలా చక్కగా నటించారు . కొన్ని కొన్ని సన్నివేశాల్లో లీనమై చేసినట్టు తెలుస్తుంది .ఈ చిత్రానికి మాస్ మూవీ మేకర్స్ నిర్మాణం వహించారు. బేబీ మూవీ జనం లో హైప్ రావడానికి గల ప్రధాన కారణం సంగీతమనే చెప్పాలి .