చిరు మూవీ లో బ్రహ్మీ..?

Dr. Brahmanandam
Dr. Brahmanandam

తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక మూడు దశాబ్దాల పాటు తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన హాస్యనటుడు ఎవరనుకుంటున్నారు ??
అయన ఎవరో కాదు లెజెండరీ కమెడియన్ డాక్టర్ బ్రహ్మానందం. ఆయన కెరీర్ మొదలుపెట్టాక.. ఆ తర్వాతి ఏళ్లలో ఎంతోమంది కమెడియన్లు వచ్చి ,చాలామంది కొన్నేళ్లు మాత్రమే దూకుడు చూపించి ,ఆ తర్వాత సైడ్ అయిపోయారు. కానీ ఒక్క బ్రహ్మానందం మాత్రం ఏళ్లు గడిచినా , తరాలు మారినా తన నటన ప్రత్యేకతను చాటుకుంటూ వచ్చారు.

చిన్న సినిమా , పెద్ద సినిమా అని లేకుండా తనదైనా శైలి లో కొత్త తరం ప్రేక్షకులను కూడా ఉర్రుతలూగిస్తూ సాగిపోయిన బ్రహ్మి , గత కొన్నేళ్లుగా దూకుడు తగ్గించారు . ఒకనొక టైం లో బ్రహ్మి లేని సినిమా అంటూ ఏమి ఉండేది కాదు . అయన సినిమా చేస్తున్నాడంటే , అయన సినిమాలో కనిపిస్తే హిట్ అయ్యిన సినిమాలు ఉన్నాయి . బ్రహ్మి గారు ఏ క్యారెక్టర్ ఇచ్చిన సునాయాసంగా చేసే ఘనత ఆయనకే సొంతం . కానీ గత నాలుగు సంవత్సరాలుగా పెద్ద సినిమాలేమి లేవని చెప్పాలి. ఈ గ్యాప్ తర్వాత ఈ మధ్య యాక్టీవ్ అయినా , పెద్ద చిత్రాలలో కామెడీ పాత్రలు చెయ్యడం లేదు .

ఇటువంటి సమయంలో బ్రహ్మి కి భోళా శంకర్ మూవీ లో అవకాశం దక్కింది .చిరు -బ్రహ్మి కాంబినేషన్ వచ్చిన సినిమాలు పెద్ద పెద్ద బ్లాక్ బ్లాస్టర్ అయ్యాయి .సినిమాకు బ్రహ్మి నటిస్తున్నారనే సంగతి తాజాగా వెల్లడైంది. బ్రహ్మి తన పాత్రకు డబ్బింగ్ చెప్పిన సందర్భంగా ఒక ఫొటో తీసుకున్నారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ ఐయ్యింది . బ్రహ్మితో చిరుకు ఉన్న అనుబంధం గురించి అందరికీ తెలిసిందే. బ్రహ్మికి సినిమాల్లో బ్రేక్ ఇప్పించిందే చిరు. వీరి కలయికలో ఎన్నో అదిరిపోయే కామెడీ ట్రాక్స్ వచ్చాయి.