Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తాజాగా విడుదల అయిన “పైసా వసూల్ ” థియేట్రికల్ ట్రైలర్ చూస్తే బాలయ్య ఫాన్స్ కి మాత్రమే కాదు తెలుగు సినీ అభిమానులందరికీ పెద్ద షాక్ తగిలింది. దీనికి కారణం బాలయ్య, పూరి. ఇన్నాళ్లు బాలయ్యని కొత్తగా చూపిస్తామని చెప్పిన దర్శకులు ఎందరో వున్నారు గానీ నిజంగా ఆయన బాడీ లాంగ్వేజ్ ని పూర్తిగా మార్చేసిన దర్శకుడు ఎవరూ లేరు.ఒక్క పూరి జగన్నాధ్ మాత్రం ఇందుకు మినహాయింపు. ఎందుకంటే …పైసా వసూల్ థియేట్రికల్ ట్రైలర్ చూస్తున్నంత సేపు బాలయ్య కన్నా పూరి మార్క్ ఎక్కువగా కనిపిస్తోంది. పూరి మార్క్ హీరో కమ్మేసిన బాలయ్య నిజంగా సరికొత్తగా కనిపిస్తున్నాడు. బాలయ్య రఫ్ నెస్ లో కూడా ఇంత స్టైలిష్ గా కనిపించడం ఇదే తొలిసారి. పైసా వసూల్ సినిమా హిట్ అవుతుందా లేదా అన్నది పక్కనబెడితే బాలయ్యని ఇంతగా మార్చేసిన పూరీని మెచ్చుకుని తీరాల్సిందే. 100 సినిమాలు చేసాక కూడా ఓ దర్శకుడి అంచనాలకు తగ్గట్టు ఇంతగా మారిపోడానికి సిద్ధమైన బాలయ్యకి కూడా హాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే.
మరిన్ని వార్తలు: