‘బిగ్‌బాస్‌’ ఇంట్లో తాప్సికి ఏం పని?

tapsee-entrying-into-ntr-bigg-boss-show

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

తెలుగు ప్రేక్షకులు విశేషంగా ఆధరిస్తున్న ‘బిగ్‌బాస్‌’ షోతో స్టార్‌ మాటీవీ రేటింగ్స్‌లో మునుపెన్నడు చేరనంత ఎత్తుకు ఎదిగింది. ఇప్పటి వరకు స్టార్‌ మాటీవీ తన ప్రత్యర్థి ఈటీవీ, జెమిని ఛానెల్స్‌ను ఈ స్థాయిలో క్రాస్‌ చేసి, దూసుకు వెళ్లింది లేదు. ‘బిగ్‌బాస్‌’ పుణ్యమా అని ఎన్టీఆర్‌ను ఫ్యాన్స్‌ బుల్లి తెరపై చూసేస్తున్నారు. ప్రతి వారంలో రెండు రోజుల పాటు ఎన్టీఆర్‌ బిగ్‌బాస్‌తో సందడి చేస్తున్నాడు. ఇక షోకు భారీ ఆధరణ వస్తున్న నేపథ్యంలో సినిమాల ప్రమోషన్స్‌ కోసం కూడా బిగ్‌బాస్‌ను ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికే ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రం ప్రమోషన్‌ కోసం బిగ్‌బాస్‌ హౌస్‌లోకి రానా వెళ్లాడు. 

రానా తర్వాత బిగ్‌బాస్‌ హౌస్‌లోకి తాప్సి వెళ్లబోతుంది. రేపు బిగ్‌బాస్‌ హౌస్‌లో తాప్సి సందడి చేయబోతున్నట్లుగా విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది. తాజాగా ఈమె ‘ఆనందోబ్రహ్మ’ అనే చిత్రాన్ని చేసిన విషయం తెల్సిందే. ఆ సినిమా విడుదల సందర్బంగా ప్రమోషన్స్‌ కోసం ఇలా బిగ్‌బాస్‌ ఇంటికి వెళ్లబోతుంది. ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రంకు బిగ్‌బాస్‌ వల్ల మంచి ప్రేక్షకాధరణ, పబ్లిసిటీ లభించింది. అందుకే కాస్త బడ్జెట్‌ ఎక్కువ అయినా సరే అనుకుని ‘బిగ్‌బాస్‌’ ఇంట్లోకి ఆనందో బ్రహ్మ చిత్ర యూనిట్‌ సభ్యులు తాప్సిని పంపిస్తున్నారు. దాదాపు 20 నుండి 30 నిమిషాల పాటు బిగ్‌బాస్‌ షోలో తాప్సి సందడి చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.

 

‘బిగ్‌బాస్‌’ ఇంట్లో తాప్సికి ఏం పని? - Telugu Bullet

మరిన్ని వార్తలు:

పైసావ‌సూల్ లో బాల‌య్య న్యూలుక్