Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా ఆయన తనయుడు బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన చిత్రం ‘ఎన్టీఆర్’. ఈ చిత్రానికి మొదట తేజ దర్శకత్వం వహించబోతున్నట్లుగా ప్రకటించారు. సినిమా ప్రారంభోత్సవం సందర్బంగా కూడా తేజ హాజరు అవ్వడం, సినిమాను దసరాకు విడుదల చేస్తాం అంటూ ప్రకటించడం జరిగింది. అయితే సినిమా త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నారు అనే సమయంలో తేజ తప్పుకుంటున్నట్లుగా ప్రకటించి బాంబు పేల్చాడు. అసలేం జరిగిందనే విషయం తెలియకుండానే, ఆ విషయంపై క్లారిటీ రాకుండానే బాలయ్య మరో దర్శకుడి వేటలో పడ్డాడు.
పలువురి పేర్లు పరిశీలించిన తర్వాత బాలకృష్ణ స్వయంగా దర్శకత్వం చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా ప్రచారం జరిగింది. రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో ఎన్టీఆర్ చిత్రానికి బాలకృష్ణ దర్శకత్వం వహిస్తాడని ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు వచ్చాయి. ఆ విషయాన్ని అనధికారికంగా చిత్ర యూనిట్ సభ్యులు కూడా దృవీకరించారు. అయితే ఇదో ప్రతిష్టాత్మక చిత్రం అవ్వడంతో పాటు, బాలకృష్ణ అనేక పాత్రలు పోషిస్తూ చాలా కష్టపడాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో దర్శకత్వం కూడా అంటే సినిమా ఫలితం తారు మారు అయ్యే అవకాశం ఉంది. అందుకే సినిమా దర్శకత్వ బాధ్యతలను ఎవరికో ఒకరికి అప్పగించి షాడో డైరెక్టర్గా బాలయ్య వ్యవహరించాలని భావిస్తున్నాడు. అందుకే ఆ నలుగురు, అందరి బందువయ్య చిత్రాలతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న దర్శకుడు చంద్ర సిద్దార్థను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఆ విషయాన్ని క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.






