Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆధ్యాత్మిక గురువు, సంఘ సంస్కర్త రామానుజాచార్య జీవిత చరిత్ర ఆధారంగా త్వరలోనే సినిమా చేస్తానని నందమూరి బాలకృష్ణ చెప్పారు. తన తండ్రి దివంగత ఎన్టీఆర్ తీయలేకపోయిన సినిమాను తాను తీస్తానని ఆయన తెలిపారు. వేల ఏళ్ల క్రితమే దళితులకు సమాజంలో సరైన గౌరవం కల్పించిన మహనీయుడు రామానుజాచార్య అని బాలకృష్ణ కొనియాడారు. రామానుజాచార్యపై పోస్టల్ స్టాంప్ విడుదల చేసినందుకు ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీతానగరం విజయకీలాద్రిపై బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. విజయకీలాద్రి క్షేత్రంలో బాలకృష్ణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామి ఆశీర్వాదం పొందారు. విజయకీలాద్రి క్షేత్రం విశిష్టత గురించి బాలకృష్ణకు చినజీయర్ స్వామి వివరించారు.