Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఈ తరానికి పెద్దగా తెలియదేమో గానీ ఒకప్పుడు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు అభిమాన సంఘం అనగానే రెండు పేర్లు గుర్తుకు వచ్చేవి. అందులో మొదటిది హైదరాబాద్ కి చెందిన దివంగత శ్రీపతి రాజేశ్వర్ ది అయితే రెండో పేరు నెల్లూరు జిల్లా వాసి తాళ్ళపాక రమేష్ రెడ్డి. ఎన్టీఆర్ అభిమాన సంఘం నాయకులు అన్న ఆ పేరే ఆ ఇద్దరికీ రాజకీయ బిక్ష పెట్టింది. దాంతో వాళ్ళు ఎమ్మెల్యేలు, మంత్రులు అయ్యారు. అయితే వాళ్ళు రాజకీయంగా ఎంత ఎదిగినా ఎన్టీఆర్ అభిమానులు గానే ఎక్కువ గుర్తింపు పొందారు. అందుకే ఎన్టీఆర్ మరణం తర్వాత కూడా నందమూరి బాలయ్య ఆ ఇద్దరికీ ఎక్కడలేని ప్రాధాన్యం ఇచ్చేవారు. శ్రీపతి రాజేశ్వర్ బతికి ఉన్నన్నాళ్ళు ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ అమర్ జ్యోతి ర్యాలీకి బాలయ్య వెళ్లేవారు. ఇప్పుడు ఆయన కుమారుడు ఏర్పాటు చేస్తున్న ర్యాలీకి కూడా బాలయ్య ప్రాధాన్యం ఇస్తుంటారు.
ఇక నెల్లూరు జిల్లా విషయానికి వస్తే ఎన్టీఆర్ అభిమానిగా ఎదిగిన తాళ్ళపాక రమేష్ రెడ్డి రాజకీయాల్లో కాలు పెట్టి మంత్రి అయ్యారు. ఎన్టీఆర్ మరణం తర్వాత పార్టీలో ఈయన ప్రాభవం తగ్గిపోయింది. కానీ టీడీపీ లో బాలయ్య యాక్టివ్ అయ్యాక రమేష్ రెడ్డి బౌన్స్ బ్యాక్ అయ్యారు. అయితే నుడా చైర్మన్ గా కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రమాణస్వీకార కార్యక్రమానికి బాలయ్య నెల్లూరు వెళ్లారు. ఆ సభలో ఏమోగానీ బాలయ్య టూర్ అంతా రమేష్ రెడ్డి హడావిడి చేసేస్తారని అంతా భావించారు. కానీ జరిగింది వేరు. బాలయ్య పాల్గొన్న ఈ సభకి రమేష్ రెడ్డి దూరంగా వున్నారు. ఆనం బ్రదర్స్ బాలయ్య సభకు డుమ్మా కొట్టినా ఎవరూ పట్టించుకోలేదు గానీ రమేష్ రెడ్డి రాకపోవడం మీద నెల్లూరు జిల్లాలో జోరుగా చర్చ సాగుతోంది. తన గైరుహాజరీ కారణాలు చెబుతూ త్వరలో రమేష్ రెడ్డి బాలయ్యని కలుస్తారని కూడా ఓ వాదన వినిపిస్తోంది. కారణం ఏదైనా ఎన్టీఆర్ వీరాభిమాని బాలయ్య సభకు దూరంగా ఉండటం మాత్రం చిన్న విషయం కాదు.
మరిన్ని వార్తలు