Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సంక్రాంతికి అజ్ఞాతవాసి తో పోటీకి వస్తున్న జైసింహా స్టోరీ లైన్ గురించి ఓ ప్రచారం జోరుగా సాగుతోంది. బాలకృష్ణ కి ఆవేశం ఎక్కువ. ఎక్కడ తప్పు జరుగుతున్నా చూస్తూ ఊరుకోలేడు. అలాంటి బాలయ్య ప్రకాష్ రాజ్ పెద్దరికాన్ని గౌరవిస్తాడు. అతను కూడా బాలయ్య మంచితనం అంటే ముచ్చట పడతాడు. అదే బాలకృష్ణ తన కుమార్తె నయనతార ని ప్రేమించిన విషయం ప్రకాష్ రాజ్ కి తెలుస్తుంది. కానీ ఇంతటి ఆవేశపరుడుని చేసుకుని నా కుమార్తె ఎలా సుఖంగా ఉంటుందని ప్రకాష్ రాజ్ ప్రశ్నిస్తాడు. అందులోని నిజాన్ని గ్రహించిన బాలయ్య తన ప్రేమని వదులుకుని వెళ్ళిపోతాడు. ఆలా విడిపోయిన బాలయ్య, నయనతార వేర్వేరు పెళ్లిళ్లు చేసుకుంటారు. బాలయ్య భార్య హరిప్రియ, నయనతార ఒకే సారి కాన్పుకి వస్తారు. అయితే నయనతార బిడ్డ చనిపోవడంతో బాలయ్య తన బిడ్డని ఆమె పొత్తిళ్ళకి చేరుస్తాడు. అక్కడే కధలో కీలక మలుపు వస్తుంది. మొత్తానికి జైసింహా కథ గా సోషల్ మీడియాలో హల్ చెల్ చేస్తున్న ఈ స్టోరీ లో నిజం వుందో, లేదో ఈ సినిమా విడుదల అయితే కానీ తెలియదు.