బాలయ్య ఫైనల్‌గా ఫిక్స్‌ అయ్యాడు…!

Balakrishna New Film Directed By Vinayak

నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రస్తుతం ‘ఎన్టీఆర్‌’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. క్రిష్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఎన్టీఆర్‌’ చిత్రం వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం రెండవ షెడ్యూల్‌ను జరుపుకుంటున్న ఎన్టీఆర్‌ చిత్రం చేస్తూనే మరో సినిమాను చేసేందుకు బాలయ్య గత కొన్ని రోజులుగా కథలు వింటూ ఉన్నాడు. మొన్నటి వరకు బాలయ్య తదుపరి చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించబోతున్నాడు అంటూ ప్రచారం జరిగింది. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వినాయక్‌ దర్శకత్వంలోనే బాలయ్య తదుపరి చిత్రం ఉండబోతుందని క్లారిటీ వచ్చేసింది.

Balakrishna New Film Directed By Vinayak

దర్శకుడు వినాయక్‌ గత సంవత్సరం ఖైదీ నెం.150 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా మంచి విజయాన్ని దక్కించుకున్నా కూడా పెద్ద హీరోలతో ఈయనకు ఛాన్స్‌ రాలేదు. మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌తో సినిమాను చేసి ఫ్లాప్‌ అయ్యాడు. ఇంటిలిజెంట్‌ ఫ్లాప్‌తో వినాయక్‌తో సినిమా అంటేనే హీరోు మరియు నిర్మాతలు భయపడుతున్నారు. ఇలాంటి సమయంలో నిర్మాత సి కళ్యాణ్‌ పట్టుబట్టి బాలయ్య కోసం వినాయక్‌తో ఒక స్క్రిప్ట్‌ను రెడీ చేయించాడు. దాదాపు నాలుగు నెలల పాటు స్క్రిప్ట్‌ వర్క్‌ జరిగింది. ఎట్టకేలకు మంచి కథ రెడీ అయ్యిందని, త్వరలోనే బాలయ్యతో సినిమా మొదలు పెడతాను అంటూ వినాయక్‌ ప్రకటించాడు. ఈ చిత్రానికి సి కళ్యాణ్‌ నిర్మాతగా వ్యవహరిస్తాడు అంటూ కూడా దర్శకుడు వినాయక్‌ క్లారిటీ ఇచ్చాడు. నవంబర్‌లో ప్రారంభం కాబోతున్న బాలయ్య, వినాయక్‌ల మూవీ వచ్చే ఏడాది సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

Balakrishna New Film Directed By Vinayak