బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ సినిమా

బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ సినిమా

రూలర్ సినిమా తరువాత కాస్త విరామం తీసుకున్న బాలకృష్ణ తాజాగా బోయపాటి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. అయితే ఈ సినిమాలో బాలయ్యను ఢీకొట్టబోయే విలన్ ఎవరై ఉంటారని ప్రేక్షకులలో తీవ్ర ఆసక్తి నెలకొంది. అయితే లెజెండ్ సినిమా ద్వారా విలన్‌గా పరిచయమైన జగపతి బాబు విలన్ పాత్రలో మంచి మార్కులే కొట్టేయడం కాకుండా, బాలయ్య పౌరుషానికి ఏ మాత్రం తీసిపోకుండా డైలాగ్‌లు చెప్పాడు. తాజాగా చేస్తున్న సినిమాలో మాత్రం బాలయ్య పక్కన మరో కొత్త విలన్‌ని పరిచయం చేయాలని బోయపాటి భావిస్తున్నారట.

అయితే ముందుగా ఈ సినిమాలో హీరో రాజశేఖర్‌ని విలన్‌గా అనుకున్నారని కాకపోతే మళ్ళీ మరో పేరును పరిశీలిస్తున్నట్టు సమాచారం. కమెడియన్, హీరో సునీల్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించబోతున్నారని, సునీల్ చేయబోయేది విలన్ పాత్రనే అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. అయితే తాజాగా రవితేజ హీరోగా తెరకెక్కిన చిత్రం డిస్కో రాజాలో సునీల్ విలన్ పాత్రలో నటించి అందరిని మెప్పించారు. అయితే బోయపాటి లాంటి మాస్ డైరెక్టర్ సినిమాలో నిజంగా విలన్ పాత్రలో కనుక సునీల్ నటిస్తే ఆయన కమెడీయన్, హీరోగానే కాకుండా మంచి విలన్‌గా కూడా ప్రేక్షకుల మదిలో నిలిచిపోవడం ఖాయంగా కనిపిస్తుంది.