విజయశాంతి డైలాగ్‌లతో రెచ్చిపోయిన ఎమ్మెల్యే రోజా

విజయశాంతి డైలాగ్‌లతో రెచ్చిపోయిన ఎమ్మెల్యే రోజా

ఏపీ అసెంబ్లీలో సరిలేరు నీకెవ్వరు సినిమాలోని విజయశాంతి డైలాగ్‌లోతో వైసీపీ ఎమ్మెల్యే రోజా రెచ్చిపోయింది. ఏపీ శాసన మండలి రద్దు తీర్మానంపై జరిగిన చర్చలో మాట్లాడిన రోజా టీడీపీపై సంచలన ఆరోపణలు చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ కోసం సీఎం వైఎస్ జగన్ తీసుకొచ్చిన బిల్లులను టీడీపీ అడ్డుకోవడం దారుణమని ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు ఈ బిల్లుపై ఆనందం వ్యక్తం చేస్తున్నారని అన్నారు.

అయితే గాయం విలువ తెలిసిన వాడే సాయం చేయగలడు అంటూ సరిలేరులో విజయశాంతి డైలాగ్‌ని చెబుతూ, పాదయాత్రలో జగన్ తనకు అయిన గాయాలు మర్చిపోయి ప్రజల గాయాలు తెలుసుకుని వాటికి చికిత్స చేస్తున్నారని అననరు. శాసన సభలో ప్రజలు ఎన్నుకున్న 151 మంది ఎమ్మెల్యేలు బిల్లును ఆమోదించి పంపితే అలాంటి బిల్లును మండలిలో వ్యతిరేకించి అవమానించారని, ప్రజల కోసం ఉపయోగపడని కౌన్సిల్ అవసరం లేదని అన్నారు. శాసనమండలి రద్దవడానికి కనీసం రెండేళ్లు పడుతుందని, ఒకవేళ రద్దయినా తాను మళ్లీ తీసుకొస్తానంటూ చంద్రబాబు ప్రెస్‌మీట్‌లో చెప్పడం కాదని దమ్ముంటే శాసన సభలో వచ్చి మాట్లాడాలని అన్నారు.