శాసన మండలిని రద్దు నిర్ణయంపై స్పందించిన కేశినేని నాని

శాసన మండలిని రద్దు నిర్ణయంపై స్పందించిన కేశినేని నాని

ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ ఎంపీ కేశినేని నాని వరుస ట్వీట్లతో విరుచుకుపడుతున్నారు. నేడు అసెంబ్లీలో శాసన మండలిని రద్దు చేస్తూ జగన్ తీసుకున్న నిర్ణయంపై స్పందించిన కేశినేని నాని జగన్ అన్నా నువ్వూ నీ ముఠా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసి అమరావతి నుండి రాజధానిని ఒక అంగుళం కూడా కదల్చలేరని అన్నారు.అంతేకాదు హైకోర్టును కూడా అమరావతి నుండి మార్చలేరని, శాసనమండలిని రద్దు చెయ్యాలనే మీ ప్రతిపాదన జరిగే పని కాదని అసలు మీ వల్ల ఏదీ కాదని అంటూ ఎకనామిక్ టైమ్స్ ప్రచురించిన ఓ కథనాన్ని పోస్ట్ చేశాడు.

అయితే దేశంలో శాసనమండలిని ఏర్పాటు చేయడం లేదా రద్దు చేయడం అనే అంశాలపై ఓ జాతీయ విధానం ఉండాలంటూ గతంలో పార్లమెంటరీ కమిటీ ఏర్పాటయ్యిందని, కొత్త ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినప్పుడు ఇష్టానుసారంగా మండలిని రద్దు చేసుకుంటూ పోవడం సరికాదని ఆ కమిటీ అభిప్రాయపడిందని అందులో పేర్కొన్నట్టుగా గుర్తు చేశారు. అయితే 1985లో టీడెపీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శాసనమండలిని రద్దు చేయగా, 2007లో సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మండలిని పునరుద్ధరించారు. అయితే ఈ రెండుసార్లు కూడా కేంద్రం ఆమోదంతోనే జరగడం విశేషం.