Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రస్తుతం నందమూరి బాలకృష్ణతో ‘జైసింహా’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్న సి కళ్యాణ్‌పై గతంలో పలు ఆరోపణలు వచ్చిన విషయం తెల్సిందే. తాజాగా హైదరాబాద్‌లో సి కళ్యాణ్ దాదాపు 80 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ఒక దిన పత్రికలో కథనాలు వచ్చాయి. హైటెక్ సిటీకి కాస్త దూరంలో తెలంగాణ ప్రభుత్వంకు 500 ఎకరాల ఖాళీ భూమి ఉంది. ఆ భూమిలో 80 ఎకరాలను సి కళ్యాణ్ తనది అన్నట్లుగా జెండా పాతించుకున్నాడు అని, దాన్ని అధికారులు కూడా పట్టించుకోవడం లేదు అంటూ సదరు పత్రిక కథనంలో పేర్కొనడం జరిగింది.
ఈ విషయంపై ఇప్పటి వరకు తెలంగాణ రెవిన్యూ అధికారులు స్పందించలేదు. త్వరలోనే రెవిన్యూ సిబ్బంది ఈ విషయాన్ని పరిశీలించాలని ప్రభుత్వ వర్గాల నుండి ఆదేశాలు వెళ్లాయి. మరో వైపు సి కళ్యాణ్‌పై సుమోటోగా కేసును నమోదు చేయాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. సి కళ్యాణ్ కబ్జా చేసినట్లుగా ప్రచారం జరుగుతున్న ఆ భూమి విలువ దాదాపుగా 2500 కోట్ల వరకు ఉండే అవకాశం ఉంటుందని సమాచారం. ఈ వ్యవహారంపై సి కళ్యాణ్ ఇంకా స్పందించలేదు. నిజంగానే నిర్మాత ఇంత భారీ మొత్తంలో ల్యాండ్‌ను కబ్జా చేస్తే మాత్రం అది సంచలనమే. ఆ పత్రిక ప్రచురించిన కథనంలో నిజా నిజాలు ప్రభుత్వ అధికారులు తేల్చాల్సి ఉంది.