బాలయ్య నోట అక్కినేని మాట…త్వరలో శుభవార్త.

balakrishna speech about akkineni family at jai simha audio function

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నందమూరి బాలయ్య, అక్కినేని నాగార్జున మధ్య దూరం బహిరంగ రహస్యమే. ఆ దూరం తగ్గడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇప్పటికైతే ఫలించలేదు. అసలు ఈ గొడవ ఎందుకు మొదలయ్యిందో కచ్చితంగా ఎవరికీ తెలియదు. ఎక్కువమంది చెబుతున్నదాని ప్రకారం అక్కినేని నాగేశ్వరరావు గారు బతికి వున్నప్పుడు ఆయనకు చేసిన ఓ సన్మాన కార్యక్రమానికి ఇండస్ట్రీ లో అందర్నీ పిలిచి బాలయ్య ని మర్చిపోవడంతో సమస్య వచ్చిందని అంటారు. అందులో నిజం ఎంతో ఎవరికీ తెలియదు. కానీ ఆ రూమర్ వచ్చాక అక్కినేని కుటుంబానికి బాలయ్య దూరంగా ఉండడం అందరి దృష్టికి వచ్చింది. చివరకు నాగేశ్వరరావు మరణించినప్పుడు కూడా బాలయ్య వెళ్ళలేదు.

balakrishna

ఇక నాగ్ వైపు నుంచి కూడా బాలయ్యతో ప్రాబ్లెమ్ సాల్వ్ చేసుకోడానికి కొన్ని ప్రయత్నాలు జరిగినా రెండో వైపు నుంచి సానుకూల వాతావరణం లేక సమస్య అలాగే ఉండిపోయింది అంటారు. ఈ మధ్య అక్కినేని ఇంట జరిగిన శుభకార్యాలు, సినిమా ఫంక్షన్స్ కి కూడా బాలయ్య వచ్చినట్టు కనిపించలేదు. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు రెండు కళ్ల లాంటి నందమూరి , అక్కినేని కుటుంబాల మధ్య ఈ దూరం ఎంతో మందిని ఆవేదనకు గురి చేస్తోంది. ఈ తరుణంలో పట్టుదలకు మారుపేరులా వుండే బాలయ్య నోట జైసింహా ఫంక్షన్ లో అక్కినేని మాట వినిపించడం ఆశ్చర్యం కలిగించింది.

balakrishna-about-akkineni

పొగడ్తలకు దూరంగా ఉండడం అక్కినేని నాగేశ్వరరావు గారి దగ్గర నేర్చుకున్నానని బాలయ్య చెప్పిన మాటలతో ఒక్కసారిగా సీన్ మారిపోయే ఛాన్స్ వచ్చింది. ఎప్పటినుంచో అక్కినేని మాట మాట్లాడ్డానికి వెనకాడిన బాలయ్య తాజా కామెంట్స్ రెండు కుటుంబాల మధ్య ముఖ్యంగా నాగ్ తో ఆయనకు సుహృద్భావ వాతావరణానికి ఉపయోగపడతాయి. అలాంటి పరిస్థితి వస్తే బాలయ్య , నాగ్ తో మల్టి స్టారర్ తీయడానికి ఎంతో మంది నిర్మాతలు రెడీ గా వున్నారు. తెలుగు సినీ అభిమానులు కోరుకున్నట్టు జరిగితే త్వరలో ఆ శుభవార్త కూడా వింటాం.