Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఒకరేమో గురువు. పైగా మహా మేధావి. పేరు రామ్ గోపాల్ వర్మ. ఇంకొకరు స్టార్ హీరో. డ్రగ్స్ వ్యవహారంలో ఇండస్ట్రీ అంతా దూరం పెడుతుంటే దగ్గరకు తీసిన హీరో. తీస్తున్న సినిమా హిట్టో ఫట్టో తెలియక ముందే ఇంకో సినిమా ఇస్తానన్న భోళా శంకరుడు బాలకృష్ణ. ఈ ఇద్దరి మధ్య దర్శకుడు పూరి అగ్నిపరీక్ష కి గురి అవుతున్నాడు. నిజానికి వర్మ తో ఎన్టీఆర్ బయోపిక్ ఆలోచన పూరి దేనన్న వార్తలు అప్పట్లో వినిపించాయి. ఎవరూ ఊహించని ఈ కలయికని సుసాధ్యం చేసింది పూరి అని అంతా అనుకున్నారు. లోపల ఏమి జరిగిందో గానీ శిష్యుడు కాదు కదా లోకంలో ఎవరి మాట వినని వర్మ ఆల్రెడీ ” లక్ష్మీస్ ఎన్టీఆర్ ” అంటూ బాలయ్యకి మండించే సినిమా పనిలో పడ్డాడు. ఇటు బాలయ్య గుంభనగా ఎన్టీఆర్ బయోపిక్ స్క్రిప్ట్ పనుల్లో వుంటున్నారు. ఈ పరిస్థితిలో ఎవరికి ఏమీ చెప్పలేక, ఏమీ చేయలేక తెగ మధనపడిపోతున్నారు పూరి.
అయితే ఈ అగ్నిపరీక్ష నుంచి బయటపడడానికి అన్నట్టు కొడుకు తో మెహబూబా సినిమా మొదలు పెట్టాడు పూరి. అయితే అక్కడే పూరి ఊహించనిది జరిగింది. ఎన్టీఆర్ సినిమా విషయంలో వర్మ పేరు తెచ్చినందుకు కోపంగా ఉంటారన్న బాలయ్య స్వయంగా పూరి కొడుకుని అభినందించారు. పూరికి పెద్దగా నమ్మకం లేకపోయినా తానే పూనుకుని ఆ సినిమాకి మంచి ముహూర్తం కూడా పెట్టించారు బాలయ్య. ఇందుకు పూరి సోషల్ మీడియా సాక్షిగా బాలయ్యకి థాంక్స్ చెప్పుకున్నాడు. ఇంకో వైపు వర్మ మాత్రం “లక్ష్మీస్ ఎన్టీఆర్ ” పనుల్లో చురుగ్గా వున్నాడు. దీంతో బాలయ్య తన కోసం ఇంత చేస్తున్నా గురువు రామ్ గోపాల్ వర్మకి ఏమీ చెప్పలేక పూరి సతమతం అవుతున్నాడంట.