తేజకి బాలయ్య గ్రీన్ సిగ్నల్.

Balakrishna next movie with Teja

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
కొత్త సినిమాల విషయంలో ఫటఫటా నిర్ణయాలు తీసుకోవాలంటే బాలయ్య తర్వాతే ఎవరైనా. ఓ వైపు కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తూనే ఇంకో సినిమాకి బాలయ్య ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఆ సినిమా కి కథ రాసింది ఎవరో కాదు. ప్రముఖ దర్శకుడు తేజ. ఇటీవల నేనే రాజు… నేనే మంత్రి సినిమాతో ఫామ్ లోకి వచ్చిన తేజ చెప్పిన కథ బాలయ్యకి బాగా నచ్చిందట. ఈ సినిమా చేయడానికి బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అయితే ఈ సినిమాకి ఇంకా ప్రొడ్యూసర్ ఎవరు అన్నది ఇంకా తేలలేదు.

ఈ కాంబినేషన్ లో సినిమా అనగానే చిత్రపరిశ్రమతో పాటు సామాన్య సినీ అభిమానుల్లోనూ అంతులేని ఆసక్తి కనిపిస్తోంది. ఇందుకు కారణం లేకపోలేదు. ఈ ఇద్దరికీ కాస్త కోపం పాళ్ళు ఎక్కువని చిత్రసీమలో టాక్. సరిగ్గా నటించకపోతే నటీనటుల మీద తేజ చేయి చేసుకుంటాడు అని కధలుకధలుగా చెప్పుకుంటారు. ఇక బాలయ్య అభిమానుల మీద చేయి చేసుకున్న సంఘటనలు ఇటీవల సోషల్ మీడియా లో సర్వసాధారణంగా కనిపిస్తున్నాయి. ఈ ఇద్దరు ఓ కధకి ఓకే చెప్పడం సరే గానీ, వీరితో సినిమా చేసే ప్రొడ్యూసర్ ఎవరు అవుతారో చూడాలి. మొత్తానికి పూరి, తేజ లాంటి వాళ్ళ కి ఇప్పుడు ఛాన్స్ ఇస్తూ బాలయ్య లేట్ వయసులో కొత్తదనం కోసం ప్రయత్నిస్తున్నట్టుంది.