Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నందమూరి బాలకృష్ణ 101వ చిత్రం ‘పైసా వసూల్’ సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. సినిమా ప్రమోషన్ కోసం పాటల ట్రైర్లను విడుదల చేయడం జరుగుతుంది. ఈ చిత్రంలో అన్నగారి పాట కొంటెనవ్వు… ను రీమిక్స్ చేయడం జరిగింది. ఆ పాటను కొన్ని కారణాల వల్ల ఆడియో విడుదల సందర్బంగా విడుదల చేయలేదు. తాజాగా ఆ పాటకు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు. ఆ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఎన్టీఆర్ పాటలో బాలయ్యను చూస్తుంటే బాగుందని నందమూరి ఫ్యాన్స్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
పూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై నందమూరి ఫ్యాన్స్‌లో అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా ఈ చిత్రంను పూరి తెరకెక్కించాడు. బాలయ్యతో ఈ సినిమాలో శ్రియ మరోసారి రొమాన్స్ చేసింది. ఇప్పటికే విడుదలైన స్టంపర్ మరియు ట్రైలర్లు సినిమా స్థాయిని అమాంతం పెంచేశాయి. సినిమా దుమ్ము దుమ్ముగా ఉంటుందనే నమ్మకంతో చిత్ర యూనిట్ సభ్యులు ఉన్నారు. ఫ్యాన్స్ కూడా అదే ఆశిస్తున్నారు. సినిమాపై వచ్చిన అంచనాల నేపథ్యంలో భారీగానే ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. మరి అందరి అంచనాలను అందుకుని ఈ సినిమా సక్సెస్ సాధిస్తుందా అనేది చూడాలి.
మరిన్ని వార్తలు: