Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
Balakrishna Yoga is the occasion of International Yoga Day
సాదారణంగా స్టార్ హీరోలు ఏదైనా పబ్లిక్ కార్యక్రమంకు హాజరు అయ్యేందుకు ఇబ్బంది పడతారు. తాము సెలబ్రెటీలం అయిన కారణంగా జనాలు మీద పడి ఇబ్బంది పెడతారు అని ఎక్కువ మంది హీరోల అభిప్రాయం. అందుకే పబ్లిక్ కార్యక్రమాల్లో వారికి పాల్గొనాలని ఉన్నా కూడా ఎక్కువ శాతం మంది మాత్రం పాల్గొనరు. అయితే బాలయ్య మాత్రం వారికి విభిన్నం అని మరో సారి రుజువు అయ్యింది. నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్బంగా బాలకృష్ణ యోగాసనాలు వేసి అందరి దృష్టిని ఆకర్షించాడు.
మొన్నటి వరకు ‘పైసా వసూల్’ చిత్రం కోసం పోర్చ్‌గల్‌లో బిజీగా గడిపిన బాలకృష్ణ ఇటీవలే హైదరాబాద్ చేరుకున్నాడు. హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్‌లో యోగా దినోత్సవంను వైభవంగా నిర్వహించడం జరిగింది. పార్క్‌లో భారీగా జనాలు ఉన్నా కూడా బాలకృష్ణ ఏమాత్రం ఇబ్బంది పడకుండా పెద్దగా సెక్యూరిటీ లేకుండానే యోగాసనాలు వేసి అందరిని అబ్బురపర్చాడు. కేబీఆర్ పార్క్ అంటే నిత్యం ఫుల్‌గా రద్దీ ఉండే ప్రాంతం. బాలకృష్ణ రాకతో అక్కడ జనాలు ఇంకా భారీగా పెరిగారు. వేరే హీరోలు అయితే జనాలను వచ్చే వారు కాదు. కాని బాలయ్య మాత్రం ఎప్పుడు జనాల్లో ఉండాలనుకుంటాడు. అలాగే యోగా గురించి నలుగురికి తెలియాలనే ఉద్దేశ్యంతో కేబీఆర్ పార్క్‌లో యోగా చేసి మరి కొందరు యోగా చేసేందుకు స్ఫూర్తిదాయకంగా నిలిచాడు. అందుకే నందమూరి ఫ్యాన్స్ వెరిగుడ్ బాలయ్య అంటున్నారు.
మరిన్ని వార్తలు: