అరుదైన వ్యాధితో ఆసుపత్రిపాలైన బాలయ్య హీరోయిన్…కష్టమేనట ?

sneha ullal hospitalized with a rare illness

గతంలో తెలుగులో పలు చిత్రాలు చేసిన స్నేహా ఉల్లాల్ కి ఆ తర్వాత అవకాశాలు పెద్దగా రాలేదు, దాంతో ముంబయి మకాం మార్చింది. ఆమె చివరిగా 2014లో ‘అంతా నీ మాయలోనే’ చిత్రంలో నటించింది. అయితే ఆమె అరుదైన వ్యాధితో బాధపడుతోందని ఆమె స్వయంగా ప్రకటించింది. ఆమె ఆటో ఇమ్యూన్ డిజార్డర్ తో బాధపడుతున్నట్టు గతంలోనే గుర్తించారు. విపరీతమైన జ్వరంతో బాధపడుతున్న ఆమెను కుటుంబసభ్యులు ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం స్నేహా ఉల్లాల్ కోలుకుంటోందట. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ శరీర వ్యాధి నిరోధక శక్తికి సంబంధించిన సమస్య. ఎన్నిసార్లు చికిత్స తీసుకున్నా ఫలితం ఉండడంలేదని స్నేహా ఉల్లాల్ వాపోయింది. ఆసుపత్రి బెడ్ పై పడుకుని ఉండాలంటే విసుగొస్తోందని, అయితే, నెట్ ఫ్లిక్స్, కొందరు శ్రేయోభిలాషులు ప్రతిక్షణం వెంట ఉండడంతో నెట్టుకొస్తున్నానని లేకపోతే కష్టమే నంటూ చెబుతూ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. ఈ మేరకు ఇన్ స్టాగ్రామ్ లో ఆసుపత్రి బెడ్ పై తాను పడుకున్న ఫొటోలను అమ్మడు పోస్ట్ చేసింది. స్నేహా ఉల్లాల్ తెలుగులో ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత నందమూరి బాలకృష్ణతో సింహా వంటి బ్లాక్ బస్టర్ మూవీలో నటించింది. అనంతరం కొన్ని తెలుగు సినిమాల్లో చేసినా అవేవీ విజయవంతం కాలేదు. పిల్లి కళ్ళ ఐశ్వర్యా రాయ్ గా అభిమానులు పిలిచుకునే ఈ భామ మళ్ళీ ఇన్నాళ్ళకి ఇలా వార్తల్లోకి వచ్చింది అన్నమాట.