మాస్ డైరక్టర్ వివి వినాయక్ ఒక్కపుడు స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. కొత్త డైరక్టర్స్ వస్తుండటం కొత్త సినిమాలు రావడం ప్రేక్షకులు కూడా కొత్త దానం కోరుకోవడంతో వివి వినాయక్ పడిపోయాడు. వరసగా ఆ మద్య సినిమాలు చేసిన ఏ ఒక్కటి విజయాన్ని సాధించలేకపోయాయి. అక్కినేని వారసుడుగా అఖిల్ ను పరిచయం చేస్తూ అఖిల్ సినిమాను రూపొందించాడు. ఈ సినిమా పరాజయం పాలు కావడంతో చాలా విమర్శలను ఎదురుక్కునాడు. ఆ తరువాత్ మెగా స్టార్ చిరంజీవి 150వ సినిమా ఖైది నెంబర్ 150 చిత్రం తీసి 100కోట్ల క్లబ్ లో చేర్చిన క్రెడిట్ మొత్తం అన్నయ్య కు పొయింది. మరల ఆ సినిమా తమిళ సినిమా రీమేక్ కావడం వలన వివి వినాయక్ కు అవకశాలు మాత్రం రాలేదు. ఆ తరువాత సాయి ధరం తేజ్ తో ఇంటలిజెంట్ సినిమా తీసి. అసలు వివి వినాయక్ కు సినిమా తీసే ఇంటలిజెంట్ లేదు అనిపించుకున్నాడు.
ఏ ఒక్క స్టార్ హీరో కూడా వినాయక్ వైపు చూడటం లేదు. ఆ మద్య నందమూరి బాలకృష్ణ తో సి. కళ్యాణ్ నిర్మాత గా ఓ సినిమా ఉంటుందని సోషల్ మీడియాలో తెగ వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఏ మాత్రం కనిపించడం లేదు. బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ సినిమా షూటింగ్ తో చాలా బిజీగా ఉన్నాడు. వివి వినాయక్ మాత్రం బాలకృష్ణ కోసం వెయిట్ చేస్తున్నాడు. కన్నడ మూవీ మఫ్టిని బాలకృష్ణ తో హీరోగా రీమేక్ చెయ్యాలని వినాయక ప్రయత్నిస్తున్నాడు. కానీ మఫ్టి చిత్రంలో మరో హీరో అవసరం ఒక్క వేల ఆ సినిమా కానీ రీమేక్ చేస్తే బాలకృష్ణ పాత్ర మాత్రం సెకండ్ ఆఫ్ నుండి స్టార్ట్ అవ్వుతుంది. కావున బాలకృష్ణ వివి వినాయక్ తో సినిమా కు ఇంటరెస్ట్ చుపించకపోవచ్చు. సోలో గా ట్రై చేద్దాం అంటే ఆల్రెడీ రెండు మూడు డిజాస్టర్ ఉన్నాయి కావున బాలకృష్ణ వినాయక్ కు ఛాన్స్ ఇచ్చే అవకాశం లేదు.