Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఎన్నో ప్రేమ కథలను తెలుగు ప్రేక్షకుల ముందు ఉంచిన దర్శకుడు తేజ దాదాపు దశాబ్ద కాలం పాటు సక్సెస్‌లు లేక ఢీలా పడిపోయాడు. ఎట్టకేలకు రానాతో తెరకెక్కించిన పొలిటికల్ చిత్రం ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రం సూపర్ హిట్‌తో తేజకు మళ్లీ మంచి రోజులు వచ్చాయి. ప్రస్తుతం స్టార్ హీరోలు తేజ వైపు ఆసక్తిగా చూస్తున్నారు. మంచి స్క్రిప్ట్‌తో వస్తే నటించేందుకు సిద్దం అంటూ స్వయంగా తేజాతో ఒక ప్రముఖ హీరో అన్నాడట. ఇక తాజాగా బాలయ్య కూడా తేజ వైపు చూస్తున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.
బాలయ్య తన తండ్రి జీవిత చరిత్రతో సినిమాను చేసేందుకు సిద్దం అవుతున్నాడు. ఇటీవల కూడా అతి త్వరలో దర్శకుడిని ప్రకటించబోతున్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఈ నేపథ్యంలో బాలయ్య చూపు తేజ వైపు ఉందని అంటున్నారు. ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రంలో పొలిటికల్ సీన్స్‌ను చక్కగా చూపించిన తేజపై ఎన్టీఆర్ ఆటో బయోగ్రఫీ చిత్ర బాధ్యతను వేయాలని బాలయ్య భావిస్తున్నాడని, త్వరలోనే ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి ఈ భారంను మోసేందుకు తేజ ముందుకు వస్తాడా, బాలయ్య నమ్మకంను నిలుపుకుంటాడా అనేది చూడాలి.