అయితే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కూడా హెయిర్ ఫాల్ సమస్యకు కారణం అవే డస్ట్ మరియు పొల్యూషన్. సాధారణంగా బట్టతల సమస్య పెద్ద వయసు వారిలోనే ఉండేది. అయితే ఇప్పుడు పరిస్థితులు మారడం బట్టి చిన్న వయసు వారు కూడా జాగ్రత్త పడాల్సి ఉంటుంది.ఈ సమస్య మొదలైనప్పుడు నుండే జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. అలా చేస్తే కొంత వరకు దానిని తక్కువ సమయంలోనే నయం చేసుకోవచ్చు.
బట్టతల సమస్య వల్ల నుదిటి పై ఉండే జుట్టు పల్చబడుతుంది, అదే విధంగా హెయిర్ ఫాల్ ఎక్కువ జరుగుతుంది. అయితే వాటికి చాలా కారణాలు ఉన్నాయి మరియు చిన్నవారు అంటే 20 మరియు 30 ఏళ్లు వాళ్లకు కూడా ఈ సమస్య ఎందుకు వస్తుందో తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే దీని కోసం ఇప్పుడే పూర్తిగా చూసేయండి. ఈ సమస్యకు కారణాలు ఎంతో క్లియర్‌గా వివరించారు. దీంతో మీరు చాలా విషయాలని తెలుసుకోచ్చు.
ప్రతి రోజూ తీసుకొనే ఆహారంలో షుగర్ శాతం ఎక్కువగా ఉండటం. ప్రస్తుతం ప్యాకేజ్డ్ ఫుడ్స్ మరియు ప్రాసెస్డ్ ఫుడ్స్‌ను తినడం అలవాటు అయిపోయింది. తక్కువ టైమ్‌లో రుచికరమైన ఆహారం అందుతుంది అని భావిస్తున్న వాటి వల్ల చాలా ప్రమాదం ఉంది అని గమనించాలి. హై గ్లైసెమిక్ డైట్‌ను ఎక్కువగా తీసుకోవడం. దాని వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగిపోతుంది మరియు హెయిర్ ఫాల్ ఎక్కువ అయిపోతుంది.
విటమిన్ డెఫిషియెన్సీ వల్ల కూడా హెయిర్ ఫాల్ జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు తీసుకునే ఆహారంలో విటమిన్లు, మినరల్స్, జింక్, ఐరన్, మరియు కాల్షియం వంటి పోషక విలువలు ఎక్కువగా ఉండే వాటివి తీసుకోండి. అవి ఆరోగ్యానికి తప్పకుండా మేలు చేస్తాయి. సరైన లైఫ్‌స్టైల్ లేకపోవడం వల్ల థైరాయిడ్ గ్లాండ్‌లో చాలా మార్పులు కనబడతాయి. దాంతో ముందుగా చిన్న వయసు వారిలోనే బట్టతల వస్తుంది. ఫిట్నెస్ కోసం ప్రోటీన్ పౌడర్లు వాడటం సహజమే. కానీ కొన్ని ప్రోటీన్ పౌడర్స్ వల్ల జుట్టు ఊడిపోతుంది.
బట్టతల మరియు హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండాలంటే చాలా ఆరోగ్యకరమైన అలవాట్లను మీ లైఫ్ స్టైల్లో అలవాటు చేసుకోవాలి. దాంతో హెయిర్ ఫాల్ సమస్య రాకుండా జాగ్రత్త పడవచ్చు. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న విపరీతంగా హెయిర్ లాస్ అవుతుంటే, మీకు ఎటువంటి ఇంప్రూవ్మెంట్స్ కనిపించక పోతే తప్పకుండా డాక్టర్ ను సంప్రదించి మీ సమస్యకు పరిష్కారం తెలుసుకోండి.